Home సినిమా వార్తలు Kannada Star Actor as Hanuman in Jai Hanuman ‘జై హనుమాన్’ : హనుమంతుని...

Kannada Star Actor as Hanuman in Jai Hanuman ‘జై హనుమాన్’ : హనుమంతుని గా కన్నడ స్టార్ యాక్టర్

jai hanuman

యువ దర్శకుడు ప్రశాంత్ వర్మ ఇటీవల రిలీజ్ అయిన హనుమాన్ మూవీతో దేశవ్యాప్తంగా విశేషమైన క్రేజ్ అందుకున్నారు. ఈ ఏడాది సంక్రాంతి కానుకగా రిలీజ్ అయిన హనుమాన్ అన్ని భాషల్లో మంచి విజయం అందుకుంది. ఇక దీని అనంతరం ప్రస్తుతం తన ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ లో భాగంగా రెండు సినిమాలు తెరకెక్కించేందుకు సిద్ధమయ్యారు ప్రశాంత్.

ఆ రెండు సినిమాలతో పాటు తాజాగా హనుమాన్ కి సీక్వెల్ అయిన జై హనుమాన్ కి కూడా శ్రీకారం చుట్టారు. రేపు దీపావళి పండుగని పురస్కరించుకొని ఈ సినిమాలో కీలకమైన హనుమంతుని పాత్రధారిలో నటించే నటుడిని అనౌన్స్ చేశారు. కాగా ఆ పాత్రకు కాంతారా నటుడు మరియు దర్శకుడు అయిన రిషబ్ శెట్టి ని ఎంపిక చేశారు.

కొద్దిసేపటి క్రితం జై హనుమాన్ ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ చేయగా ఆ పోస్టర్ లో హనుమంతుని పాత్రలో శ్రీరాముని విగ్రహం గుండెలకు హత్తుకుని ఉన్న రిషబ్ శెట్టి పిక్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. మైత్రి మూవీ మేకర్స్, ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ కలిసి గ్రాండ్ లెవెల్లో రూపొందిస్తున్న ఈ సినిమా 2026 లో పట్టాలెక్కి 2027లో రిలీజ్ అయ్యే అవకాశం ఉంది. ప్రస్తుతం మోక్షజ్ఞతో మూవీ చేస్తున్నారు ప్రశాంత్ వర్మ, అలానే మరోవైపు కాంతారా ది లెజెండ్ మూవీతో రిషబ్ బిజీగా ఉన్న విషయం తెలిసిందే.

Follow on Google News Follow on Whatsapp




Show comments
Exit mobile version