Home సినిమా వార్తలు Mohan Babu and Manoj File Complaints Against Each Other బ్రేకింగ్ : మోహన్...

Mohan Babu and Manoj File Complaints Against Each Other బ్రేకింగ్ : మోహన్ బాబు, మనోజ్ ఒకరిపై మరొకరు ఫిర్యాదులు

mohan babu manoj

టాలీవుడ్ సీనియర్ నటుడు కళాప్రపూర్ణ కలెక్షన్ కింగ్ డాక్టర్ మోహన్ బాబు ఇంట్లో తాజాగా వివాదాలు చోటు చేసుకుని ఆ అంశం ప్రస్తుతం తారాస్థాయికి చేరింది. మొదటి నుండి క్రమశిక్షణకు మారుపేరుగా నిలిచే మోహన్ బాబు ఇంట ఇటువంటి వివాదాలు చోటుచేసుకోవడంతో అందరూ ఒక్కసారిగా షాక్ అవుతున్నారు.

ఇక తన కుమారులు విష్ణు, మనోజ్, కుమార్తె లక్ష్మి ల గురించి ఎప్పుడూ గొప్పగా చెప్తూ ఉంటారు మోహన్ బాబు. అటువంటి మోహన్ బాబు తన చిన్న కుమారుడు మనోజ్ ని కొట్టారని నిన్నటి నుండి వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. విషయం ఏమిటంటే, నిన్న గాయాలతో ఆసుపత్రిలో చేరిన మనోజ్ నేడు తన తండ్రి తన పై, తన భార్య మౌనిక పై ఘోరంగా దాడి చేసారని కేసు పెట్టారు.

కాగా అనంతరం తన కుమారుడు మనోజ్ తన పై దాడి చేసారని, తనకు ప్రాణ హాని ఉందని మోహన్ బాబు కూడా పోలీసులకు ఫిర్యాదు చేసారు. ఈ విధంగా తండ్రి కొడుకులు ఇద్దరూ కూడా ఒకరిపై మరొకరు దాడి పేరుతో కేసులు పెట్టుకోవడంతో వీరింటి వివాదం ప్రస్తతం తెలుగు రాష్ట్రాల్లో చర్చనీయాంశంగా మారింది. మరి ఇది రానురాను ఎటువంటి పరిస్థితులకు దారితీస్తుందో చూడాలి.

Follow on Google News Follow on Whatsapp




Show comments
Exit mobile version