Home సినిమా వార్తలు బాక్సాఫీస్ వద్ద చతికలపడ్డ ‘మజాకా’

బాక్సాఫీస్ వద్ద చతికలపడ్డ ‘మజాకా’

mazaka

తెలుగు సినిమా పరిశ్రమలో కామెడీ యాక్షన్ ఎంటర్టైనర్లతో మంచి సక్సెస్ లు అందుకుంటూ కొనసాగుతున్న దర్శకుల్లో త్రినాధరావు నక్కిన కూడా ఒకరు. తాజాగా సందీప్ కిషన్, రీతు వర్మ, రావు రమేష్, అన్షుల కలయికలో ఆయన తెరకెక్కించిన ఫ్యామిలీ యాక్షన్ కామెడీ ఎంటర్టైనర్ సినిమా మజాకా. ఈ మూవీకి లియాన్ జేమ్స్ సంగీతం అందించగా హాస్య మూవీస్ బ్యానర్ పై రాజేష్ దండ దీనిని గ్రాండ్ గా నిర్మించారు. 

మొత్తంగా మొదటి నుంచి అందరిలో మంచి అంచనాలు ఏర్పర్చిన ఈ కామెడీ మూవీ ఇటీవల ఫిబ్రవరి 26న ఆడియన్స్ ముందుకు వచ్చింది. అయితే ఫస్ట్ డే ఫస్ట్ షో నుంచే పాజిటివ్ టాక్ అందుకున్న ఈ సినిమా ప్రస్తుతం బాక్సాఫీస్ దగ్గర ఆశించిన స్థాయి కలెక్షన్స్ అయితే అందుకోలేకపోతోంది. ముఖ్యంగా కొన్ని ప్రాంతాల్లో ఈ సినిమాకి చాలా తక్కువస్థాయి కలెక్షన్ వస్తుండడంతో టీంకి షాక్ ను కలిగిస్తోంది. 

ఇటీవల మజాకా సక్సెస్ మీట్ లో దర్శకుడు అండ్ టీం మాట్లాడుతూ తమ సినిమా అందర్నీ ఆకట్టుకునేలా తెరకెక్కించామని మరోవైపు కలెక్షన్స్ మరింతగా రాబోయే రోజుల్లో పెరుగుతాయనేటువంటి ఆశాభావం అయితే వారు వ్యక్తం చేశారు. ఇక దర్శకుడు త్రినాధ రావు నక్కిన తన మార్కు కామిడీ ఎంటర్టైన్మెంట్ అంశాలు జపించిన ఈ సినిమాలో సందీప్ కిషన్, రావు రమేష్, రీతు వర్మ, అన్షు అందరూ కూడా తమ పెర్ఫార్మన్స్అ లతో లరించారు. 

విషయం ఏమిటంటే, ప్రస్తుతం ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద చతికలపడడం బట్టి చూస్తే సందీప్ కిషన్ కెరీర్ లో మరొక డిజాస్టర్ గా మజాకా నిలిచే అవకాశం ఉంది. మరోవైపు బయ్యర్లకు ఏ సినిమా 1/3 వ వంతు మాత్రమే పెట్టుబడిని రాబట్టే అవకాశం కనపడుతోంది. మరి ఓవరాల్ గా మజాకా మూవీ ఎంతమేర కలెక్షన్ అందుకుంటుందో తెలియాలంటే మరి కొద్దిరోజులు వెయిట్ చేయాల్సిందే. 

Follow on Google News Follow on Whatsapp




Show comments
Exit mobile version