విక్టరీ వెంకటేష్ హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఐశ్వర్య రాజేష్, మీనాక్షి చౌదరి హీరోయిన్స్ గా తెరకెక్కిన తాజా ఫ్యామిలీ యాక్షన్ ఎంటర్టైనర్ సినిమా సంక్రాంతికి వస్తున్నాం. ఇటీవల సంక్రాంతి పండుగ కానుకగా మంచి అంచనాలతో ఆడియన్స్ ముందుకు వచ్చిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద అతిపెద్ద బ్లాక్ బస్టర్ విజయం అందుకుంది.
శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు ప్రతిష్టాత్మకంగా నిర్మించిన ఈ మూవీకి భీమ్స్ సిసిలోరియో సంగీతం సమకూర్చారు. ఆకట్టుకునే ఫ్యామిలీ యాక్షన్ మూవీగా రూపొందిన సంక్రాంతికి వస్తున్నాం మొన్న జీ తెలుగులో వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ గా ప్రసారమై మంచి రెస్పాన్స్ అందుకుంది.
మరోవైపు ఈ మూవీ అదే రోజున జీ 5 ద్వారా ఓటిటి ఆడియన్స్ ముందుకు వచ్చింది. విషయం ఏమిటంటే, ఈ సినిమా జీ5 ఓటీటీలో ఆర్ఆర్ఆర్, హనుమాన్ రికార్డులను బద్దలు కొట్టింది. తాజాగా ఈ సినిమా కేవలం కొన్ని నిమిషాల్లోనే 100 మిలియన్ నిమిషాలకు పైగా వ్యూస్ ని సొంతం చేసుకుంది. అలానే 12 గంటల్లో దాదాపుగా 1.3 మిలియన్ వ్యూయర్స్ చూసిన మూవీగా ఇది గతంలోని ఆర్ఆర్ఆర్, హనుమాన్ ల రికార్డులని బద్దలుకొట్టి సరికొత్త రికార్డు నెలకొల్పింది.
మరోవైపు ఈ సినిమా టిఆర్పి పరంగా కూడా భారీ స్థాయిలో రాబట్టే అవకాశం కనబడుతోంది. ఆ విధంగా ఓవైపు థియేటర్స్ లో మరోవైపు ఓటీటిలో ఇంకోవైపు బుల్లితెరపై కూడా అదరగొట్టిన సంక్రాంతికి వస్తున్నాం సీక్వెల్ 2026లో తెరకెక్కి 2027 జనవరిలో ఆడియన్స్ ముందుకు రానుంది