నాచురల్ స్టార్ నాని ఇటీవల సరిపోదా శనివారం సినిమా మూవీ ద్వారా ఆడియన్స్ ముందుకు వచ్చి అతిపెద్ద విజయం అందుకున్నారు. తాజాగా ఆయన హీరోగా తెరకెక్కుతున్న హిట్ 3 సినిమా మే 1న గ్రాండ్ గా ఆడియన్స్ ముందుకు రానుంది. ఈ మూవీపై అందరిలో మంచి అంచనాలు ఉన్నాయి.
అయితే దీని అనంతరం త్వరలో దసరా దర్శకుడు శ్రీకాంత్ ఓదెలతో ది పారడైజ్ మూవీ చేయనున్నారు నాని. ఈ మూవీపై అందరిలో కూడా మంచి హైప్ నెలకొని ఉంది. ఎస్ ఎల్ వి సినిమాస్ సంస్థ పై సుధాకర్ చెరుకూరి గ్రాండ్ లెవెల్ లో నిర్మించనున్న ఈ మూవీకి సంబంధించిన టీజర్ మార్చి 3న రిలీజ్ కానుంది.
అయితే విషయం ఏమిటంటే తెలుగు, తమిళ, హిందీ, కన్నడ, మలయాళం, బెంగాలీ తోపాటు ఇంగ్లీష్ మరియు స్పానిష్ వంటి ఇంటర్నేషనల్ భాషల్లో కూడా ఈ టీజర్ రిలీజ్ కానుంది. అలానే ఈ గ్లింప్స్ టీజర్ కోసం టీమ్ దాదాపుగా రూ. 1 కోటి రూపాయల వరకు ఖర్చు చేసినట్లు టాలీవుడ్ టాక్. భారీ స్థాయి విజువల్ ఎఫెక్ట్స్ ఈ గ్లింప్స్ లో ఉండనున్నాయట.
దీన్ని బట్టి చూస్తే పారడైజ్ మూవీని భారీ స్థాయిలో గ్లోబల్ గా కూడా ఆడియన్స్ ని టార్గెట్ చేసినట్టు తెలుస్తోంది. మరోవైపు యష్ హీరోగా తాజాగా గీతూ మోహన్ దాస్ తీస్తున్న టాక్సిక్ కూడా ఇదే విధంగా గ్లోబల్ రేంజ్ లో సిద్ధం అవుతుంది.