Home సినిమా వార్తలు Marco OTT Getting Poor Response from Telugu Audiance ‘మార్కో’ ఓటిటి : తెలుగు ఆడియన్స్ నుండి...

Marco OTT Getting Poor Response from Telugu Audiance ‘మార్కో’ ఓటిటి : తెలుగు ఆడియన్స్ నుండి పూర్ రెస్పాన్స్

ఇటీవల ఉన్నిముకుందన్ హీరోగా తెరకెక్కిన మలయాళ యాక్షన్ బ్లాక్ బస్టర్ మూవీ మార్కో. హనీఫ్ అదేని ఈ మూవీని తెరకెక్కించగా క్యూబ్స్ ఎంటర్టైన్మెంట్స్, ఉన్ని ముకుందన్ ఫిల్మ్స్ సంస్థలు ఈ మూవీని గ్రాండ్ గా నిర్మించాయి.

మలయాళంలో అందర్నీ ఆకట్టుకుని ఓవరాల్ గా రూ. 100 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్ సొంతం చేసుకున్న ఈ మూవీ అనంతరం తెలుగులో కూడా డబ్ కాబడి ఇక్కడ ఆడియన్స్ ని కూడా అలరించింది. ముఖ్యంగా యాక్షన్ తో కూడిన రివెంజ్ డ్రామాగా ఆకట్టుకునే కథ, కథనాలతో అలరించే విజువల్స్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ తో రూపొందిన మార్కో మూవీ అందరి నుంచి మంచి స్పందన అందుకుంది. 

తెలుగు ఆడియన్స్ కూడా థియేటర్స్ లో దీనికి మరింతగా మంచి రెస్పాన్స్ అందించారు. అయితే ఇటీవల ప్రముఖ ఓటిటి మాధ్యమం సోనీ లివ్ ద్వారా ఫిబ్రవరి 14న ఈ మూవీ తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ వర్షన్స్ లో ఓటిటి ఆడియన్స్ ముందుకొచ్చింది. అయితే తెలుగు ఓటిటి ఆడియన్స్ నుంచి మాత్రం ఈ సినిమాకి ఆశించిన స్థాయి రెస్పాన్స్ అయితే రావడం లేదు. 

ఇక హిందీ వర్షన్ కూడా అమెజాన్ ప్రైమ్ లో స్టీమ్ కాబడి పరవాలేదనిపించే రెస్పాన్స్ సొంతం చేసుకుంటోంది. త్వరలో మార్కోకు సీక్వెల్ అయిన మార్కో 2 సెట్స్ మీదకు వెళ్లనున్న విషయం తెలిసిందే. దానిని పార్ట్ 1 నుంచి మరింత గ్రాండ్ లెవెల్ లో తరకెక్కించుకున్నారట. 

Follow on Google News Follow on Whatsapp




Show comments
Exit mobile version