ప్రస్తుతం సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా లోకేష్ కనకరాజ్ దర్శకత్వంలో రూపొందుతోన్న గ్యాంగ్ స్టర్ మాస్ యాక్షన్ డ్రామా మూవీ కూలీ. ఈ మూవీని సన్ పిక్చర్ సంస్థ ప్రతిష్టాత్మకంగా భారీ వ్యయంతో నిర్మిస్తుండగా అనిరుద్ రవిచందర్ సంగీతం సమకూరుస్తున్నారు.
శృతిహాసన్, ఉపేంద్ర, నాగార్జున, అమీర్ ఖాన్ పలు కీలకపాత్రల్లో నటిస్తున్న కూలీ మూవీ త్వరలో ఆడియన్స్ ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతోంది. ఈ సినిమాలో రజనీకాంత్ క్యారెక్టర్ ఎంతో పవర్ఫుల్ గా డిజైన్ చేశారట దర్శకుడు లోకేష్ కనకరాజ్. విషయం ఏమిటంటే తాజాగా కూలీ సెట్స్ లో సందడి చేశారు యువ నటుడు సందీప్ కిషన్.
దర్శకుడు లోకేష్ తనకు స్నేహితుడు కావడంతో ఆ సెట్స్ కి వెళ్ళిన సందీప్ కిషన్, సూపర్ స్టార్ రజినీతో కలిసి దిగిన ఫోటోని సోషల్ మీడియాలో షేర్ చేశారు. అనంతరం కూలీ మూవీ గురించి సందీప్ మాట్లాడుతూ మొత్తంగా 45 నిమిషాలకు పైగా నేను మూవీ చూసానని అన్నారు.
కాగా ఈ సినిమా ఓవరాల్ గా రిలీజ్ అనంతరం రూ. 1000 కోట్లు బాక్సాఫీస్ వద్ద పెర్ఫార్మ్ చేసే అవకాశం ఉందని చెప్పుకొచ్చారు. తనకిష్టమైన సూపర్ స్టార్ రజనీకాంత్ గారికి అలానే తన ప్రియతమ దర్శకుడు లోకేష్ కనకరాజ్ తో పాటు కూలీ టీంకి ముందస్తుగా సక్సెస్ విషెస్ తెలియజేశారు సందీప్.