Home సినిమా వార్తలు NagaVamsi Planning Huge for Retro Telugu Release రెట్రో : తెలుగులో గ్రాండ్ రిలీజ్...

NagaVamsi Planning Huge for Retro Telugu Release రెట్రో : తెలుగులో గ్రాండ్ రిలీజ్ ప్లాన్ చేస్తున్న నాగవంశీ

retro

ఇటీవల సిరుత్తై శివ దర్శకత్వంలో తెరకెక్కిన పాన్ ఇండియన్ మూవీ కంగువ మూవీ ద్వారా ఆడియన్స్ ముందుకు వచ్చిన సూర్య దానితో ఘోరమైన డిజాస్టర్ చవిచూశారు. ఇక తాజాగా యువ దర్శకుడు కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వంలో ఆయన నటిస్తున్న సినిమా రెట్రో. 

ఈ మూవీలో అందాల కథానాయిక పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తుండగా సంతోష్ నారాయణన్ సంగీతం సమకూరుస్తున్నారు. ఇప్పటికే ఆల్మోస్ట్ షూటింగ్ మొత్తం పూర్తి చేసుకున్న రెట్రో మూవీ నుంచి ఇటీవల ఫస్ట్ సాంగ్, ఫస్ట్ లుక్ గ్లింప్స్ రిలీజ్ అయి అందరిఈ విశేషంగా ఆకట్టుకొని సినిమాపై మంచి అంచనాలు ఏర్పరిచాయి. 

విషయం ఏమిటంటే, ఈ సినిమా యొక్క తెలుగు రైట్స్ ని ప్రముఖ నిర్మాణ సంస్థ సితార ఎంటర్టైన్మెంట్స్ వారు రూ. 9 కోట్లకు దక్కించుకున్నారు. మే 1న ఈ మూవీ యొక్క తెలుగు వర్షన్ గ్రాండ్ లెవెల్ లో రిలీజ్ చేసేందుకు వాళ్ళు ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. 

మరోవైపు అదే రోజున తెలుగులో హిట్ 3 కూడా రిలీజ్ కానుంది. అయితే రెండిటి మధ్య పెద్దగా బాక్సాఫీస్ క్లాష్ రాకుండా రెండిటికీ సమానంగా థియేటర్స్ కేటాయింపులు ఉంటాయని అంటున్నారు సినీ విశ్లేషకులు. మరి రెట్రో మూవీతో సూర్య ఎంతమేర విజయం అందుకుంటారో చూడాలి. 

Follow on Google News Follow on Whatsapp




Show comments
Exit mobile version