ప్రస్తుతం మల్లిడి వశిష్ట దర్శకత్వంలో రూపొందుతోన్న భారీ సోషియో ఫాంటసీ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ విశ్వంభర మూవీ షూట్ లో పాల్గొంటున్నారు మెగాస్టార్ చిరంజీవి. ఇటీవల ఈ మూవీ నుండి రిలీజ్ అయిన ఫస్ట్ సాంగ్, ఫస్ట్ గ్లింప్స్ టీజర్ పర్వాలేదనిపించే రెస్పాన్స్ అందుకున్నాయి.
మరోవైపు మూవీ గ్లింప్స్ లో విజువల్ ఎఫెక్ట్స్ బాలేదని విమర్శలు వెల్లువెత్తడంతో మూవీ టీమ్ ఆ విషయమై క్వాలిటీలో బాగా శ్రద్ధ పెడుతోందట. త్రిష హీరోయిన్ గా నటిస్తున్న విశ్వంభర మూవీ ఈ ఏడాది రిలీజ్ కానుంది.
దీని అనంతరం షైన్ స్క్రీన్స్, గోల్డ్ బాక్స్ ఎంటర్టైన్మెంట్స్ సంస్థల పై సాహు గారపాటి, సుస్మిత కొండల సంయుక్తంగా నిర్మించనున్న ఈ మూవీ త్వరలో పట్టాలెక్కేందుకు సిద్ధమవుతోంది. ముఖ్యంగా ఈ మూవీ పై మెగా ఫ్యాన్స్ తో పాటు నార్మల్ ఆడియన్స్ లో కూడా మంచి అంచనాలు ఉన్నాయి.
ఇక ఈ మూవీలో హీరోయిన్ గా ప్రముఖ స్టార్ నటి నయనతార ఎంపికైనట్లు తెలుస్తోంది. ఇప్పటికే దర్శకుడు అనిల్ రావిపూడి ఆమెను కలిసి కథ వినిపించి గ్రీన్ సిగ్నల్ కూడా అందుకున్నట్లు టాక్. గతంలో మెగాస్టార్ చిరంజీవికి జోడీగా సైరా నరసింహారెడ్డి మూవీలో నటించిన నయనతార, అనంతరం గాడ్ ఫాదర్ లో ఆయనకు సోదరిగా కనిపించారు.
మొత్తంగా మెగాస్టార్ తో కలిసి ఆమె చేస్తోన్న మూడవ మూవీ ఇది ఇక ఈ మూవీలోని కీలక పాత్రల్లో మరొకికొందరు టాలీవుడ్ నటులు నటించనుండగా పూర్తి వివరాలు త్వరలో మూవీ టీమ్ నుండి అధికారికంగా వెల్లడి కానున్నాయట. మరి త్వరలో ప్రారంభం కానున్న ఈ క్రేజీ మూవీ సంక్రాంతికి రిలీజ్ అనంతరం ఎంతమేర విజయం అందుకుంటుందో చూడాలి.