Home సినిమా వార్తలు ‘స్పిరిట్’ : ప్రభాస్ కి జోడీగా బాలీవుడ్ స్టార్ నటి ఫిక్స్ ?

‘స్పిరిట్’ : ప్రభాస్ కి జోడీగా బాలీవుడ్ స్టార్ నటి ఫిక్స్ ?

spirit

పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్ హీరోగా ప్రస్తుతం తెరకెక్కుతున్న రెండు సినిమాల పై  నార్మల్ ఆడియన్స్ లో కూడా మంచి అంచనాలు ఉన్నాయి. 

కాగా వి హను రాఘవపూడి తీసిన ఒక మూవీ అలానే మారుతీ తెరకెక్కిస్తున్న ది రాజా సాబ్. ఇక ఈ రెండు సినిమాల అనంతరం త్వరలో సందీప్ రెడ్డి వంగా తీయనున్న స్పిరిట్ మూవీ షూట్ లో జాయిన్ అయ్యేందుకు సిద్ధం అవుతున్నారు ప్రభాస్. 

ఇప్పటికే ఆ మూవీలోని సిన్సియర్ పోలీస్ అధికారి పాత్ర కోసం మేకోవర్ పరంగా యూరోప్ లో ట్రైనింగ్ అయ్యారట ప్రభాస్. త్వరలో అక్కడి నుండి రాగానే రాజా సాబ్, హను ల సినిమాల బ్యాలెన్స్ వర్క్ పూర్తి చేసి స్పిరిట్ షూట్ లో జాయిన్ అవుతారని అంటున్నారు. 

ఇక స్పిరిట్ మూవీ గురించి మాట్లాడుకుంటే ఈ మూవీ పై దేశవ్యాప్తంగా ఉన్న ఆడియన్స్ లో ఎన్నో భారీ అంచనాలు ఉన్నాయి. టి సిరీస్, భద్రకాళి పిక్చర్స్ సంస్థలు దీనిని గ్రాండ్ గా నిర్మిస్తుండగా హర్ష వర్ధన్ రామేశ్వర్ సంగీతం అందిస్తున్నారు. విషయం ఏమిటంటే, ఈ మూవీలో హీరోయిన్ గా బాలీవుడ్ నటి దీపికా పదుకొనె ఎంపికయినట్లు లేటెస్ట్ బాలీవుడ్ వర్గాల బజ్. 

తాజాగా ఆమెని కలిసి కథని వినిపించి దర్శకుడు సందీప్ రెడ్డి వంగ గ్రీన్ సిగ్నల్ అందుకున్నట్లు చెప్తున్నారు. అయితే ఆ విషయమై అఫీషియల్ అనౌన్స్ మెంట్ రావాల్సి ఉంది. మొత్తంగా స్పిరిట్ మూవీ భారీ స్థాయిలో తెరకెక్కనుంది. త్వరలో ఈ మూవీ గురించి అన్ని అప్ డేట్స్ ఒక్కొక్కటిగా రానున్నాయి. 

Follow on Google News Follow on Whatsapp




Show comments
Exit mobile version