Home సినిమా వార్తలు ఇండస్ట్రీ రికార్డు నెలకొల్పిన ‘తుడరమ్’ 

ఇండస్ట్రీ రికార్డు నెలకొల్పిన ‘తుడరమ్’ 

thudarum

మలయాళ స్టార్ నటుడు మోహన్ లాల్ ఇటీవల ఎంపురాన్ మూవీ ద్వారా మంచి విజయం తన ఖాతాలో వేసుకున్న విషయం తెలిసిందే. తాజాగా శోభనతో కలిసి ఆయన చేసిన మూవీ తుడరమ్ ఈ మూవీని తరుణ్ మూర్తి తెరకెక్కించగా జేక్స్ బిజోయ్ సంగీతం సమకూర్చారు. ఇటీవల ఆడియన్స్ ముందుకి వచ్చిన ఈ మూవీ మలయాళంలో మంచి క్రేజ్ తో కొనసాగుతోంది.

ఇప్పటికే రూ. 100 కోట్ల గ్రాస్ మార్క్ దాటేసిన ఈ మూవీ 9వ రోజు కూడా కేరళలో రూ. 6 కోట్లు కొల్లగొట్టడం విశేషం. ఇక ఇది ఓపెనింగ్ డే కంటే ఎక్కువ కావడం మరింత విశేషంగా చెప్పుకోవాలి. ఇక 10వ రోజు కూడా ఇప్పటికే రూ.5 కోట్ల మేర అడ్వాన్స్ బుకింగ్ జరుపుకుంది తుడరుమ్ మూవీ.

ఆ విధంగా మలయాళం మూవీ హిస్టరీలో వరుసగా మొదటి పది రోజులు రూ. 5 కోట్ల మేర కలెక్షన్ దక్కించుకున్న మూవీగా పెద్ద రికార్డు నెలకొల్పింది. కేవలం కేరళలోనే రూ. 59 కోట్లు రాబట్టిన ఈ మోవి ఓవరాల్ గా వరల్డ్ వైడ్ క్లోసింగ్ లో రూ. 150 కోట్లు కలెక్షన్ అందుకునే అవకాశం కనపడుతోంది. మరోవైపు ప్రస్తుత పరిస్థితిని చూస్తే, మొత్తంగా కేరళలో రూ. 100 కోట్లు అందుకునే మూవీగా కూడా ఇది సాగుతోంది.

Follow on Google News Follow on Whatsapp




Show comments
Exit mobile version