నాచురల్ స్టార్ నాని హీరోగా శ్రీనిధి శెట్టి హీరోయిన్ గా యువ దర్శకుడు శైలేష్ కొలను దర్శకత్వంలో తెరకెక్కిన లేటెస్ట్ థ్రిల్లింగ్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ హిట్ 3. ఇటీవల వచ్చిన హిట్ సిరీస్ లోని రెండు సినిమాలు సక్సెస్ అయ్యాయి.
దానితో ఈమూవీ పై ప్రేక్షకుల్లో ప్రత్యేకమైన ఆసక్తి ఏర్పడింది. ఇటీవల హిట్ 3 నుండి రిలీజ్ అయిన ఫస్ట్ గ్లింప్స్ టీజర్ మొదలుకుని ట్రైలర్ వరకు అన్ని ఆకట్టుకుని మూవీ పై ఇప్పటివరకు ఉన్న అంచనాలు పెంచాయి.
అయితే ఇందులో సాంగ్స్ మాత్రం ఆశించిన స్థాయి రెస్పాన్స్ అందుకోలేదు. యునానిమస్ ప్రొడక్షన్స్, వాల్ పోస్టర్ సినిమా సంస్థలు గ్రాండ్ గా నిర్మించిన ఈ మూవీకి మిక్కీ జె మేయర్ సంగీతం అందించారు.
విషయం ఏమిటంటే, మే 1న గ్రాండ్ గా రిలీజ్ కానున్న ఈ మూవీ యొక్క సెన్సార్ కార్యక్రమాలు పూర్తి అయ్యాయి. వారి నుండి A సెర్టిఫికెట్ అందుకున్న ఈ మూవీ సెన్సార్ రిపోర్ట్ ప్రకారం. ఆద్యంతం ఆకట్టుకునే ఇంటెన్స్ డ్రామాగా సాగుతుందట. ఇప్పటికే ఈ విషయాన్ని పలు ఇంటర్వ్యూస్ లో హీరో నాని తెలిపారు.
తామందరి ఈ ప్రయత్నం తప్పకుండా సక్సెస్ అవుతుందనే ఆశాభావం ఆయన వ్యక్తం చేసారు. ఇక ఈ మూవీ యొక్క రన్ టైం 2 గం. ల 40 ని. లుగా ఉంది. మొత్తంగా మే 1న కార్మిక దినోత్సవము నాడు ఆడియన్స్ ముందుకి రానున్న హిట్ 3 మూవీ హిట్ స్టేటస్ అందుకోవాలంటే రూ. 75 కోట్లు రాబట్టాలి.