Home సినిమా వార్తలు ‘జింఖానా’ మూవీ రివ్యూ : సరదాగా సాగె బాక్సింగ్ డ్రామా 

‘జింఖానా’ మూవీ రివ్యూ : సరదాగా సాగె బాక్సింగ్ డ్రామా 

gymkhana review

సినిమా పేరు: జింఖనా

రేటింగ్: 2.75 / 5

తారాగణం: నస్లెన్, లుక్మాన్ అవరన్, గణపతి ఎస్ పొదువల్, అనఘ రవి మరియు ఇతరులు

దర్శకుడు: ఖలీద్ రెహమాన్

నిర్మాతలు: జాబిన్ జార్జ్, సుబీష్ కన్నంచెరి, సమీర్ కారత్, ఖలీద్ రెహమాన్

విడుదల తేదీ: 25 ఏప్రిల్ 2025

ఇటీవల ప్రేమలు ద్వారా ఆడియన్స్ ముందుకి వచ్చి మంచి సక్సెస్ సొంతం చేసుకున్న నటుడు నాస్లెన్ తాజాగా నటించిన మూవీ అలప్పుజ జింఖానా. ఇటీవల మలయాళంలో పెద్ద విజయం అందుకున్న ఈ మూవీ తాజాగా జింఖానా టైటిల్ తో తెలుగు ఆడియన్స్ ముందుకి వచ్చింది. ఖాలిద్ రహమాన్ తెరకెక్కించిన ఈ స్పోర్ట్స్ యాక్షన్ డ్రామా మూవీ ఎలా ఉంది, ఎంతమేర ఆడియన్స్ నుండి రెస్పాన్స్ అందుకుంటోంది అనే విషయాలు పూర్తి రివ్యూ లో చూద్దాం. 

కథ : 

కేరళ లోని అలప్పుజ లో ఇంటర్మీడియట్ పాస్ కాని జోజో జాన్సన్ (నాస్లెన్) మరియు అతడి స్నేహితులు బాక్సింగ్ నేర్చుకుంటారు. అక్కడి జింఖానాలో బాక్సింగ్ శిక్షణ తీసుకుంటారు. వారికి ఆంథోనీ జాషువా (లుక్మాన్ అవరన్) ట్రైనింగ్ ఇస్తుంటాడు. అయితే అతడు మాజీ బాక్సింగ్ ఛాంపియన్ అనే గతం ఎవరికీ తెలియదు. ఆ విధంగా శిక్షణ తీసుకుంటున్న జాన్సన్ మరియు అతడి స్నేహితులు సిన్సియర్ గానే ఉన్నారా లేక టైం పాస్ కి కొనసాగుతున్నారా, అనంతరం కేరళ రాష్ట్ర అమెచ్యూర్ బాక్సింగ్ ఛాంపియన్‌షిప్ కి సిద్దమైన వారు ఏవిధంగా తదుపరి పరిస్థితులు ఎదుర్కొన్నారు అనేది మొత్తం కూడా తెరపై చూడాల్సిందే. 

నటీనటుల పెర్ఫార్మన్స్ :

ముఖ్యంగా ఇటీవల ప్రేమలుతో తెలుగు ప్రేక్షకులకి కూడా ఎంతో దగ్గరైన నాస్లెన్ మరొక్కసారి ఈమూవీలో జోజో జాన్సన్ గా తన పాత్రలో ఆకట్టుకున్నాడు. ముఖ్యంగా పలు సీన్స్ లో అతడి నటన ఆడియన్స్ ని అలరిస్తుంది. ఇక ఇతర కీలక పాత్రలు చేసిన లుక్మాన్ అవరన్, గణపతి, బేబీ జీన్, సందీప్ ప్రదీప్, ఫ్రాంకో ఫ్రాన్సిస్, శివ హరిహరన్, కార్తీక్, షాన్ జాయ్, అనఘ రవి, నంద నిశాంత్ మరియు నోయిలా ఫ్రాన్సీ అందరూ కూడా మూవీలో తమ పాత్రల యొక్క పరిధి మేరకు బాగా పెర్ఫార్మ్ చేసారు. 

విశ్లేషణ : 

ఇక ఈ మూవీ దర్శకుడు ఖాలిద్ రహమాన్ ఈ మూవీని ఆద్యంతం ఆకట్టుకునే రీతిన నడపడంతో పాటు మూవీలో ఒక ఇంట్రెస్టింగ్ ఫన్నీ ట్విస్ట్ ని యాడ్ చేసారు. ఫస్ట్ హాఫ్ తో పోలిస్తే సెకండ్ హాఫ్ బాక్సింగ్ మ్యాచ్ లతో ఆకట్టుకునే రీతిన చాలా వరకు సాగుతుంది. జిమ్షి ఖలీద్ సినిమాటోగ్రఫీ, విష్ణు విజయ్ సంగీతం, నిషాద్ యూసుఫ్ ఎడిటింగ్ సినిమాకు మంచి ప్లస్ గా నిలిచాయి. డబ్బింగ్ విషయానికి వస్తే ప్రేమలు మాదిరిగా ఈమూవీకి కూడా డీసెంట్ డైలాగ్స్ ఎంటర్టైన్మెంట్ తో డబ్బింగ్ బాగా చెప్పారు.

ఆడియన్స్ కి అది ఎంతో ఆకట్టుకుంటుంది. ఫస్ట్ హాఫ్ నెమ్మదిగా సాగినప్పటికీ మధ్యలో కొంత ఫన్నీ సీన్స్ బాగానే ఉంటాయి. అయితే రొమాన్స్ మాత్రం అంతగా ఆకట్టుకోదు. అయితే ఇప్పటివరకు వచ్చిన స్పోర్ట్స్ యాక్షన్ డ్రామాల మాదిరిగా చివరికి విజయం దిశగా పోరాడడం వంటివి ఇందులో చూపించలేదు. కొంత రిలాక్స్డ్ వేలో సాగే ఈ సినిమా హీరో మరియు అతని స్నేహితుల యొక్క జయాపజయాలను చూపించే తీరుగా వెళ్ళదు. దానితో ఎమోషనల్ డెప్త్ కోరుకునే ప్రేక్షకులకి ఇది నచ్చకపోవచ్చు. 

ప్లస్ పాయింట్స్ :

నటీనటుల పెర్ఫార్మన్స్ లు

సెకండ్ హాఫ్

సంగీతం మరియు సీన్స్

మైనస్ పాయింట్స్:

అతి సరళీకృత ప్రేమకథ

ఎమోషనల్ డెప్త్ లేకపోవడం

తీర్పు : 

ప్రేమలు నటుడు నాస్లెన్ ప్రధాన పాత్రలో ఖలిద్ రహమాన్ దర్శకత్వంలో తెరకెక్కిన జింఖానా మూవీ కామెడీ, బాక్సింగ్ వంటి అంశాల మిళితంగా సాగుతుంది. టెక్నీకల్ అంశాలు, ఆకట్టుకునే విధంగా సాగిన నటీనటుల యొక్క పెర్ఫార్మన్స్ లు వంటివి ఈ మూవీకి ప్లస్ పాయింట్స్. ఎమోషనల్ డెప్త్ అనేది పెద్దగా లేనప్పటికీ హాయిగా ఈ స్పోర్ట్స్ యాక్షన్ డ్రామా మూవీని చూసేయొచ్చు. 

Follow on Google News Follow on Whatsapp




Show comments
Exit mobile version