యువ నటులు నార్నె నితిన్, రామ్ నితిన్, సంగీత్ శోభన్, ప్రియాంక జవాల్కర్, విష్ణు ఓఐ ప్రధాన పాత్రల్లో కళ్యాణ్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన లేటెస్ట్ కామెడీ ఎంటర్టైనర్ మూవీ మ్యాడ్ స్క్వేర్. ఇటీవల సక్సెస్ సాధించిన మ్యాడ్ మూవీకి ఇది సీక్వెల్ గా తెరకెక్కింది.
అయితే మ్యాడ్ మాదిరిగా ఈమూవీ కూడా ఆడియన్స్ ముందుకి వచ్చి విజయం అందుకుంది. ఈ మూవీలో సునీల్, శుభలేఖ సుధాకర్, సత్యం రాజేష్ ఇతర కీలక పాత్రలు చేసారు. సితార ఎంటర్టైన్మెంట్స్, శ్రీకర స్టూడియోస్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ సంస్థల పై గ్రాండ్ గా నిర్మితం అయిన ఈమూవీలో స్టోరీ తో పాటు ప్రధాన నటీనటుల యొక్క నటన, కామెడీ ఎంటెర్టైమెంట్ అంశాలు ఆడియన్స్ ని ఆకట్టుకున్నాయి.
ఆ విధంగా థియేటర్స్ లో ఆడియన్స్ ని మెప్పించిన మ్యాడ్ స్క్వేర్ మూవీ ఓవరాల్ గా వరల్డ్ వైడ్ రూ. 70 కోట్ల గ్రాస్ ని సొంతం చేసుకుంది. విషయం ఏమిటంటే తాజాగా ఈ మూవీ ప్రముఖ ఓటిటి మాధ్యమం నెట్ ఫ్లిక్స్ ద్వారా ఓటిటి ఆడియన్స్ ముందుకి వచ్చింది.
ప్రస్తుతం ఈ మూవీ తెలుగుతో పాటు తమిళ్, హిందీ, మలయాళం, కన్నడ భాషల్లో కూడా అందుబాటులో ఉంది. మొత్తంగా అటు థియేటర్స్ లో అలరించిన మ్యాడ్ స్క్వేర్ మూవీ ఇటు ఓటిటిలో ఆకట్టుకుంటుందని అంటోంది టీమ్. మరి ఈ మూవీ ఎంతమేర రెస్సాన్స్ అందుకుంటుందో చూడాలి.