సందీప్ కిషన్, రావు రమేష్, అన్షు, రీతూ వర్మ ప్రధాన పాత్రల్లో త్రినాధరావు నక్కిన తెరకెక్కించిన కామెడీ ఫ్యామిలీ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ మజాకా. ఇటీవల మంచి అంచనాలతో రిలీజ్ అయిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద పరాజయం పాలయింది.
ఇందులో కామెడీ, ఎంటర్టైన్మెంట్ సీన్స్ బాగున్నప్పటికీ కథనంలో కొన్ని లోపల వలన ఆడియన్స్ ని ఈ మూవీ అలరించలేకపోయింది. సందీప్ కిషన్ తో పాటు మిగతా పాత్రధారులు అందరూ కూడా బాగానే పెర్ఫార్మ్ చేసినప్పటికీ ఫలితం లేకపోయింది. ఓవరాల్ గా త్రినాధరావు నక్కిన కెరీర్ లో ఈ మూవీ ఊహించని విధంగా షాక్ ఇచ్చింది.
అయితే థియేటర్స్ లో ఫెయిల్ అయిన మజాకా మూవీ ఇటీవల ప్రముఖ ఓటిటి మాధ్యమం జీ 5 ద్వారా ఆడియన్స్ ముందుకు వచ్చి ఆకట్టుకుంటున్న ఈ మూవీ తాజాగా మరొక ఓటిటి మాధ్యమం అమెజాన్ ప్రైమ్ ద్వారా కూడా తాజాగా అందుబాటులో వచ్చింది. కాగా ఆమెజాన్ ప్రైమ్ లో ఈ మూవీ తెలుగు తో పాటు తమిళ్, మలయాళ, కన్నడ భాషల్లో కూడా అందుబాటులో ఉంది.
వాస్తవానికి ఈ మూవీకి రిలీజ్ కి ముందు ప్రీమియర్స్ కూడా ప్రదర్శించారు. దానికి బాగానే రివ్యూస్ వచ్చినప్పటికీ ఓవరాల్ గా మాత్రం మజాకా ఆడియన్స్ ని ఆకట్టుకోలేకపోయింది. మరి అమెజాన్ లో ఇది ఎంతమేర రెస్పాన్స్ సొంతం చేసుకుంటుందో చూడాలి.