Home సినిమా వార్తలు ‘రెట్రో’ తెలుగు వర్షన్ సెన్సార్ డీటెయిల్స్

‘రెట్రో’ తెలుగు వర్షన్ సెన్సార్ డీటెయిల్స్

retro

సూర్య ఇటీవల శివ తెరకెక్కించిన కంగువ మూవీ ద్వారా కెరీర్ లో అతిపెద్ద డిజాస్టర్ ని చవి చూసారు. ఈ మూవీ అనంతరం తాజాగా యువ దర్శకుడు కార్తీక్ సుబ్బరాజ్ తో ఆయన చేస్తున్న మూవీ రెట్రో. 

ఆకట్టుకునే రెట్రో లవ్ యాక్షన్ ఎంటర్టైనర్ గా రూపొందిన ఈమూవీకి సంతోష్ నారాయణన్ సంగీతం అందించగా కీలక పాత్రల్లో జయరాం, జాజు జార్జి, కరుణాకరన్, ప్రకాష్ రాజ్, స్వశిక తదితరు నటించారు. 

అందాల నటి పూజా హెగ్డే హీరోయిన్ గా నటించిన ఈ మూవీ నుండి ఇప్పటికే రిలీజ్ అయిన సాంగ్స్, పోస్టర్స్,టీజర్, ట్రైలర్ అన్ని కూడా బాగానే రెస్పాన్స్ సొంతం చేసుకున్నాయి. ముఖ్యంగా సూర్య ఫ్యాన్స్ ఈ మూవీ పై ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. 

మే 1 న గ్రాండ్ గా పలు భాషల ఆడియన్స్ ముందుకి ఈ మూవీ రానుంది. ఇక తాజగా రెట్రో తెలుగు వర్షన్ యొక్క సెన్సార్ కార్యక్రమాలు పూర్తి అయ్యాయి. వారి నుండి యు / ఏ సెర్టిఫికెట్ అందుకున్న ఈ మూవీ యొక్క ప్రీ రిలీజ్ ఈవెంట్ ఈరోజు సాయంత్రం హైదరాబాద్ లోని జెఆర్సీ కన్వెన్షన్ సెంటర్ లో గ్రాండ్ గా జరుగనుంది. 

రౌడీ హీరో విజయ్ దేవరకొండ ప్రత్యేక అతిధిగా రానున్న ఈమూవీ రిలీజ్ అనంతరం ఎంతమేర విజయం అందుకుంటుందో తెలియాలి అంటే మరొక నాలుగు రోజులు వైట్ చేయాల్సిందే. ఇక ఈ మూవీని స్టోన్ బెంచ్ క్రియేషన్స్, 2డి ఎంటర్టైన్మెంట్స్ సంస్థల పై కార్తేకేయన్ సంతానం, జ్యోతిక, సూర్య గ్రాండ్ గా భారీ వ్యయంతో నిర్మించారు. ఈ మూవీని తెలుగులో సితార ఎంటర్టైన్మెంట్స్ సంస్థ రిలీజ్ చేస్తోంది.

Follow on Google News Follow on Whatsapp




Show comments
Exit mobile version