పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా క్రిష్ జాగర్లమూడి, జ్యోతికృష్ణ కలిసి తెరకెక్కిస్తున్న లేటెస్ట్ పీరియాడిక్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ హరి హర వీర మల్లు. ఈ మూవీలో నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తుండగా కీలక పాత్రల్లో బాబీ డియోల్, నోరా ఫతేహి, నర్గీస్ ఫక్రి, పూజిత పొన్నాడ తదితరులు నటిస్తున్నారు.
మొదటి నుండి అందరిలో మంచి అంచనాలు ఏర్పరిచిన ఈ మూవీ నుండి రిలీజ్ అయిన ఫస్ట్ సాంగ్ పెద్దగా ఆకట్టుకోలేదు, అయితే ఇటీవల రిలీజ్ అయిన సెకండ్ సాంగ్ కి మంచి రెస్పాన్స్ లభించింది. మరోవైపు హరి హర వీర మల్లు నుండి ఇప్పటివరకు మూడు గ్లింప్స్ టీజర్స్ ని రిలీజ్ చేసారు.
మొత్తంగా అన్ని కూడా ఇప్పటివరకు మూవీ పై ఉన్న అంచనాలు అమాంతం పెంచేసాయి. విషయం ఏమిటంటే, మార్చి 28 రావాల్సిన ఈ సినిమా వాయిదా పడి రానున్న మే 9న లేటెస్ట్ గా రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకుంది.
కాగా ఆ డేట్ కి పక్కాగా హరి హర వీర మల్లు మూవీ థియేటర్స్ లో ఉంటుందని అంటోంది టీమ్. కీరవాణి సంగీతం సమకూరుస్తున్న ఈమూవీకి జ్ఞానశేఖర్, మనోజ్ పరమహంస ఫోటోగ్రఫి అందిస్తున్నారు. మరి రిలీజ్ అనంతరం ఈ మూవీ ఎంత మేర విజయం సొంతం చేసుకుంటుందో చూడాలి.