ఇటీవల హాలీవుడ్ లో రిలీజ్ అయి పెద్ద విజయం అందుకున్న మూవీ ముఫాసా లయన్ కింగ్. బ్యారీ జెంకిన్స్ తెరకెక్కించిన ఈ మూవీని వాల్ డిస్నీ సంస్థ పై ప్రతిష్టాత్మకంగా భారీ స్థాయిలో అడెలె రోమన్స్కీ, మార్క్ సెరియాక్ నిర్మించారు.
గత ఏడాది డిసెంబర్ లో రిలీజ్ అయిన ఈ మూవీ 200 మిలియన్ డాలర్స్ తో రూపొంది ఓవరాల్ గా వరల్డ్ వైడ్ 712 మిలియన్ డాలర్స్ కలెక్షన్ సొంతం చేసుకుంది. కాగా ఇండియాలోని పలు భాషల్లో కూడా రిలీజ్ అయిన ది లయన్ కింగ్ మూవీ యొక్క హిందీ వర్షన్ లో ముఫాసా పాత్రకి షారుఖ్ ఖాన్ తెలుగులో సూపర్ స్టార్ మహేష్ బాబు వాయిస్ ఓవర్ అందించారు.
తెలుగులో మహేష్ బాబు స్టార్డంతో ఈ మూవీ మంచి కలెక్షన్ సొంతం చేసుకుంది. అయితే థియేట్రికల్ రిలీజ్ అనంతరం ఈ మూవీ యొక్క ఓటిటి కోసం నాలుగు నెలలుగా అందరూ ఎదురు చూడసాగారు. కాగా అందరికీ ది లయన్ కింగ్ మూవీ యొక్క ఓటిటి రిలీజ్ అప్ డేట్ తాజాగా వచ్చేసింది.
ఇక ఈమూవీని మార్చి 26న ప్రముఖ ఓటిటి మాధ్యమం జియో హాట్ స్టార్ లో పలు భాషల ఆడియన్స్ ముందుకి తీసుకురానున్నారు. కాగా ఈ మూవీ ఇంగ్లీష్, హిందీ, తెలుగు, తమిళ భాషల్లో ఆడియన్స్ కి అందుబాటులోకి రానుంది. మరి ఈ మూవీ ఓటిటిలో ఎంత మేర ఆడియన్స్ ని మెప్పిస్తుందో చూడాలి.