ప్రస్తుతం బాలీవుడ్ లో విక్కీ కౌశల్, రష్మిక మందన్నాల కలయికలో లక్ష్మణ్ ఉటేకర్ దర్శకత్వంలో తెరకెక్కిన భారీ హిస్టారికల్ యాక్షన్ డ్రామా మూవీ ఛావా. మ్యాడాక్ ఫిలిమ్స్ బ్యానర్ పై గ్రాండ్ లెవెల్లో రూపొందిన ఈ సినిమా ఫిబ్రవరి 14న ఆడియన్స్ ముందుకు వచ్చి ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద భారీ విజయం దిశగా దూసుకెళుతోంది.
చత్రపతి శివాజీ మహారాజ్ కుమారుడు చత్రపతి శంభాజీ మహారాజ్ జీవిత చరిత్ర ఆధారంగా రూపొందిన ఈ సినిమాలో అక్షయ్ ఖన్నా, దివ్యా దత్త, అశుతోష్ రాణా, డయానా పెంటి తదితరులు కీలక పాత్రల్లో కనిపించారు.
కాగా ఇండియాలో ఈ మూవీ ఇప్పటికే రూ. 400 కోట్ల నెట్ కలెక్షన్స్ సొంతం చేసుకుంది. ఇక ఓవరాల్ గా 500 కోట్ల క్లబ్లో అయితే నేటితో చేరనుంది. ఈ సినిమా రిలీజ్ అయిన 12 రోజుల్లోనే ఈ ఫీట్ అందుకోవటం విశేషం. ఇక నేడు శివరాత్రి కావడంతో సినిమాకు మరింత భారీ స్థాయిలో కలెక్షన్ వచ్చే అవకాశం ఉంది.
దీన్ని బట్టి చూస్తుంటే ఈ సినిమా రూ. 500 కోట్లకు పైగా ఇండియాలో నెట్ కలెక్షన్ సొంతం చేసుకుని గ్రాస్ పరంగా వరల్డ్ వైడ్ రూ. 700 కోట్ల వరకు అందుకునే అవకాశం కనబడుతుంది. ఇటీవల వచ్చిన బాలీవుడ్ సినిమాల్లో వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ మూవీగా ఛావా నిలవనుంది. మరి ఓవరాల్ గా ఇది ఎంత మేర కలెక్ట్ చేస్తుందో తెలియాలి అంటే మరికొద్ది రోజుల వరకు వెయిట్ చేయాలి