ప్రస్తుతం టాలీవుడ్ పాన్ ఇండియన్ స్టార్స్ లో ఒకరైన ప్రభాస్ హీరోగా ప్రస్తుతం రెండు సినిమాలు తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. అందులో ఒకటి హను రాఘవపూడి తెరకెక్కిస్తున్న భారీ ప్రతిష్టాత్మక సినిమా కాగా, మరొకటి మారుతీ తీస్తున్న హర్రర్ కామెడీ ఎంటర్టైనర్ ది రాజా సాబ్. ఈ రెండు సినిమాలపై ప్రభాస్ ఫ్యాన్స్ తో పాటు నార్మల్ ఆడియన్స్ లో కూడా విశేషమైన అంచనాలు ఉన్నాయి.
మరోవైపు కన్నప్ప సినిమాలో కూడా రుద్ర అనే ప్రత్యేక పాత్రలో కనిపించనున్నారు ప్రభాస్. అయితే ఇటీవల సలార్, కల్కి 2898 ఏడి సినిమాలతో అత్యద్భుత విజయాలని సొంతం చేసుకున్న ప్రభాస్ వీటికి సీక్వెల్స్ లో కూడా నటించాల్సి ఉంది. కాగా మ్యాటర్ ఏమిటంటే ప్రస్తుతం హను తో సినిమాతో పాటు రాజా సాబ్ సినిమా కూడా చేస్తున్న ప్రభాస్ లేటెస్ట్ గా ప్రశాంత్ వర్మతో ఒక ప్రతిష్టాత్మక సినిమాని లైన్లో పెట్టారు.
ఈ సినిమా త్వరలో సెట్స్ మీదకు వెళ్లే అవకాశం ఉంది. కాగా నేడు ఈ సినిమాకు సంబంధించి టెస్ట్ లుక్ అయితే జరగనుంది. ప్రస్తుతం బాలకృష్ణ కుమారుడు మోక్షజ్ఞ సినిమాతో పాటు రిషబ్ శెట్టి ప్రధాన పాత్రలో రూపొందుతున్న జై హనుమాన్ మూవీస్ ప్రశాంత్ వర్మ లిస్ట్ లో ఉన్నాయి. అయితే ఈ రెండు సినిమాల అనంతరమే ప్రభాస్ సినిమా రూపొందే ఛాన్స్ కనబడుతోంది.
మరోవైపు ప్రభాస్ లైనప్ చూస్తే రాజా సాబ్, హను రాఘవపూడి సినిమాల తరువాత తాజాగా ప్రశాంత్ వర్మ సినిమా, ఆ తర్వాత త్వరలో షూటింగ్ కి రెడీ అవుతున్న స్పిరిట్ చేయనున్నారు. కాగా మ్యాటర్ ఏమిటంటే, ఈ లైనప్ ని బట్టి చూస్తే ఇవి నాలుగు పూర్తి అయిన అనంతరమే కల్కి 2898 ఏడి 2, సలార్ 2 ప్రారంభం కానున్నాయి. మరి ఈ సినిమాలతో హీరోగా ప్రభాస్ ఎంత మేర విజయాలు సొంతం చేసుకుంటాయో చూడాలి.