Home సినిమా వార్తలు Ntr Neel Movie Shoot Begins సెట్స్ మీదకి ఎన్టీఆర్ – నీల్ మూవీ

Ntr Neel Movie Shoot Begins సెట్స్ మీదకి ఎన్టీఆర్ – నీల్ మూవీ

ntr neel

టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా ఇటీవల కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన భారీ పాన్ ఇండియన్ మాస్ యాక్షన్ మూవీ దేవర పార్ట్ 1. గత ఏడాది సెప్టెంబర్ లో మంచి అంచనాలతో ఆడియన్స్ ముందుకు వచ్చిన దేవర పార్ట్ 1 మూవీ అద్భుత విజయం అందుకుని నటుడిగా ఎన్టీఆర్ క్రేజ్ ని రేంజ్ ని మరింతగా పెంచింది. 

ఇక ప్రస్తుతం బాలీవుడ్ స్టార్ నటుడు హృతిక్ రోషన్ తో కలిసి వార్ 2 మూవీ చేస్తున్నారు ఎన్టీఆర్. ఈ మూవీపై అందరిలో చాలా అంచనాలు ఉన్నాయి. ఇక తాజాగా ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ తో చేయనున్న సినిమా యొక్క షూటింగ్ ప్రారంభానికి సిద్ధమైంది. 

అందుతున్న సమాచారాన్ని బట్టి ఈ మూవీ వచ్చే సోమవారం సెట్స్ మీదకు వెళ్లనుంది. మైత్రి మూవీ మేకర్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ సంస్థలు అత్యంత ప్రతిష్టాత్మకంగా అత్యున్నత సాంకేతిక విలువలతో గ్రాండ్ లెవెల్ లో నిర్మించనున్న ఈ మూవీలో రుక్మిణి వసంత్ హీరోయిన్ గా నటిస్తుండగా కీలకపాత్రలో మలయాళ నటుడు టోవినో థామస్ కనిపించన్నట్లు చెబుతున్నారు. 

రానున్న రోజుల్లో ఈ మూవీకి సంబంధించిన ఒక్కొక్క అప్డేట్ రానుంది. కాగా ఈ మూవీని వచ్చే ఏడాది జనవరిలో రిలీజ్ చేయబోతున్నట్లు ఇప్పటికే మేకర్స్ ప్రకటించారు. అయితే అది చాలావరకు సాధ్యమయ్యే అవకాశం కనపడట్లేదు. ఈ విషయమై టీం నుంచి అఫీషియల్ గా వివరణ రావాల్సి ఉంది.

Follow on Google News Follow on Whatsapp




Show comments
Exit mobile version