Home సినిమా వార్తలు Sookshmadarshini OTT Streaming Setails మలయాళ బ్లాక్ బస్టర్ మూవీ ‘సూక్ష్మదర్శిని’ ఓటిటి స్ట్రీమింగ్ డీటెయిల్స్ 

Sookshmadarshini OTT Streaming Setails మలయాళ బ్లాక్ బస్టర్ మూవీ ‘సూక్ష్మదర్శిని’ ఓటిటి స్ట్రీమింగ్ డీటెయిల్స్ 

sookshmadarshini

ఇటీవల మలయాళ చిత్ర పరిశ్రమలో రిలీజ్ అవుతున్న పలు సినిమాలు ఆడియన్స్ ని ఎంతో ఆకట్టుకుని బాక్సాఫీస్ వద్ద మంచి పెర్ఫార్మన్స్ ని కనబరిచాయి. ఆ విధంగా కొన్నాళ్ల క్రితం రిలీజ్ అయిన మలయాళ మూవీస్ ప్రేమలు, మంజుమ్మేల్ బాయ్స్ అటు ఆ భాషతో పాటు ఇతర భాషల్లో కూడా ఆకట్టుకుని ఆడియన్స్ ని అలరించాయి. 

ఇక తాజాగా మలయాళ చిత్ర పరిశ్రమలో రిలీజ్ అయి అక్కడి థియేటర్స్ లో అదరగొడుతున్న మూవీ సూక్ష్మదర్శిని. ఎం సి జితిన్ దర్శకత్వం వహించిన ఈ మూవీలో నజ్రియా నజీమ్, బాసిల్ జోసెఫ్ ప్రధాన పాత్రల్లో నటించగా ఇతర ముఖ్య పాత్రల్లో దీపక్ పరాంబోల్, సిద్దార్థ భరతన్, అఖిల భార్గవన్ తదితరులు నటించారు. ​ఆకట్టుకునే కథ, కథనాలతో ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్ తో ఈ మూవీ రూపొంది ఆడియన్స్ ని అలరించింది.

విషయం ఏమిటంటే, ఈ బ్లాక్ బస్టర్ మూవీ జనవరి 11 న ప్రముఖ ఓటిటి మాధ్యమం డిస్నీ ప్లస్ హాట్ స్టార్ ద్వారా తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ, హిందీ ఆడియన్స్ ముందుకి రానుంది. మరి బాక్సాఫీస్ వద్ద రూ. 50 కోట్లు రాబట్టిన ఈ మూవీ ఓటిటి ఆడియన్స్ ని ఎంతమేర ఆకట్టుకుంటుందో చూడాలి.   

Follow on Google News Follow on Whatsapp




Show comments
Exit mobile version