సినిమా పేరు: గేమ్ ఛేంజర్
రేటింగ్: 2.5/5
తారాగణం: రామ్ చరణ్, ఎస్.జె. సూర్య, కియారా అద్వానీ, శ్రీకాంత్, అంజలి, సముద్రఖని, మరియు ఇతరులు
దర్శకుడు: శంకర్
నిర్మాత: దిల్ రాజు
విడుదల తేదీ: 10 జనవరి 2025
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా కియారా అద్వానీ హీరోయిన్ గా శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన లేటెస్ట్ మూవీ గేమ్ ఛేంజర్. ఇక చరణ్, శంకర్ ల కాంబినేషన్ లో ఈ మూవీ ప్రారంభం అయిన దగ్గరి నుండి అందరిలో మంచి అంచనాలు ఉన్నాయి. దిగ్గజ నిర్మాత దిల్ రాజు ఎంతో భారీ వ్యయంతో నిర్మించిన ఈ మూవీలో ఎస్ జె సూర్య, శ్రీకాంత్, రాజీవ్ కనకాల, సునీల్, వెన్నెల కిషోర్ తదితరులు నటించారు.
ఎస్ థమన్ సంగీతం అందించిన ఈ మూవీలోని సాంగ్స్ పర్వాలేదనిపించగా ట్రైలర్ సినిమా పై మంచి అంచనాలు ఏర్పరిచింది. ఇక ఎన్నో అంచనాల నడుమ నేడు గ్రాండ్ గా వరల్డ్ వైడ్ ఆడియన్స్ ముందుకి వచ్చింది గేమ్ ఛేంజర్ మూవీ. ఇక ఈ మూవీ యొక్క పూర్తి రివ్యూ ఇప్పుడు చూద్దాం.
కథ :
ప్రజలకు మంచి చేయాలనే ఆలోచన గల అప్పన్న ఒక రాజకీయ పార్టీ నెలకొల్పుతాడు. అయితే అతడి అనునాయులే అతడిని హతమార్చారంతో తీరని అతని కోరికని అనంతరం కొన్నేళ్ళకు అతడి కొడుకు అయిన రామ్ నందన్ ఎలా నెరవేరుస్తాడు అనే అంశం చుట్టూ ఈ కథ నడుస్తుంది.
పెర్ఫార్మన్స్ లు :
ముఖ్యంగా ఈ మూవీకి అన్ని తానై ముందుకు నడిపించారు మెగాపవర్ స్టార్ రామ్ చరణ్. ముఖ్యంగా రామ్ నందన్ పాత్రతో పాటు ఆయన చేసిన అప్పన్న పాత్ర అందరినీ ఎంతో ఆకట్టుకుంటుంది. పలు ఎమోషనల్ సీన్స్ లో చరణ్ నటన హృద్యంగా ఉంటుంది. ఇక కీలక పాత్రల్లో కనిపించిన ఎస్ జె సూర్య, శ్రీకాంత్ కూడా ఆకట్టుకున్నారు. హీరోయిన్ కియారా అద్వానీ పాత్ర చిన్నదే అయినప్పటికీ తన పాత్ర యొక్క పరిధి మేరకు మెప్పించింది. ఇతర పాత్రల్లో కనిపించిన వెన్నెల కిషోర్ కామెడీ పర్వాలేదనిపించగా సునీల్ కొంత మెప్పించారు.
వివరణ :
గేమ్ ఛేంజర్ మూవీ ముఖ్యంగా ఐఏఎస్ అధికారి రామ్ నందన్ పాత్రతో పాటు అతడికి ప్రత్యర్థి అయిన మినిస్టర్ పాత్రలో కనిపించిన ఎస్ జె సూర్యల తో ప్రారంభం అవుతుంది. వారిద్దరి మధ్య వచ్చే సీన్స్ పర్వాలేదనిపించినా కథనం మొత్తం కూడా పాత పద్ధతిలో ఎంతో ఫ్లాట్ గా సాగుతుంది. ఎమోషనల్ సీన్స్ ని ఆకట్టుకునేలా తీయడంలో శంకర్ మెప్పించలేకపోయారు.
అలానే హీరో హీరోయిన్స్ మధ్య లవ్ ట్రాక్ కూడా బాగాలేదు. పర్వాలేదనిపించే ఫస్ట్ హాఫ్ అనంతరం ఆరంభం అయ్యే సెకండ్ హాఫ్ అదిరిపోయే అప్పన్న పెరఫార్మన్స్ తో సాగుతుంది. మొత్తంగా ఆ పాత్రలో వచ్చే ఫ్లాష్ బ్యాక్ సీన్స్ ఎంతో బాగున్నాయి. ఆపైన సెకండ్ హాఫ్ లో కొన్ని హాఫ్ బేక్ట్ సీన్స్ తో పాటు పెద్దగా ఆకట్టుకోని సాంగ్స్ కూడా ఆడియన్స్ కి ఇబ్బంది కలిగిస్తాయి. ఇక మాములుగా వచ్చే క్లైమాక్స్ సీన్స్ తో ఓవరాల్ గా గేమ్ ఛేంజర్ పర్వాలేదనిపించే ఫీల్ ని మాత్రమే అందిస్తుంది.
ప్లస్ పాయింట్స్ :
- అప్పన్న పాత్రలో రామ్ చరణ్ పెర్ఫార్మన్స్
- ఎస్ జె సూర్య పెర్ఫార్మన్స్
- మ్యూజిక్ సాంగ్స్
- ఇంటర్వెల్ ఎపిసోడ్
మైనస్ పాయింట్స్ :
- లవ్ ట్రాక్
- వీక్ గా సాగె ప్రీ క్లైమాక్స్, క్లైమాక్స్
- వరస్ట్ ఎడిటింగ్
- రెగ్యులర్ స్క్రీన్ ప్లే
తీర్పు :
మొత్తంగా చూసుకుంటే అందరిలో మంచి అంచనాలతో నేడు ఆడియన్స్ ముందుకి వచ్చిన గేమ్ ఛేంజర్ మూవీ పర్వాలేదనిపిస్తుంది. శంకర్ మార్క్ టేకింగ్ పూర్తిగా మిస్ అయింది. అయితే రామ్ చరణ్ నటన, థమన్ సాంగ్స్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ వంటివి బాగున్నాయి. వీలైతే ఈ ఫెస్టివల్ సీజన్ లో ఒకసారి మీ ఫ్యామిలీ తో కలిసి ఈమూవీ ఒక్కసారి చూడవచ్చు