వెబ్ సిరీస్ పేరు: మయసభ
రేటింగ్: 3/5
నటీనటులు: ఆది పినిశెట్టి, చైతన్య రావు, మాదాడి, సాయి కుమార్, దివ్య దత్తా, తాన్య రవిచంద్రన్, రవీంద్ర విజయ్, శత్రు మరియు ఇతరులు
దర్శకుడు: దేవా కట్టా
స్ట్రీమింగ్ ఆన్: Sony Liv
దర్శకుడు దేవా కట్ట దర్శకత్వంలో ప్రముఖ రాజకీయ నాయకులు వైఎస్ రాజశేఖర్ రెడ్డి, చంద్రబాబు నాయుడు ప్రారంభ రాజకీయ జీవిత కథగా కొంత ఫిక్షనల్ అంశాలు జోడించి తెరకెక్కిన లేటెస్ట్ వెబ్ సిరీస్. ఇటీవల టీజర్ ట్రైలర్ తో అందరినీ ఆకట్టుకుని మంచి అంచనాలు ఏర్పరిచిన ఈ సిరీస్ ప్రస్తుతం ప్రముఖ ఓటిటి మాధ్యమం సోనీ లివ్ లో ప్రసారం అవుతోంది. మరి ఆ సిరీస్ యొక్క పూర్తి రివ్యూ ఇప్పుడు చూద్దాం.
కథ :
ముఖ్యంగా మయసభ సిరీస్ యొక్క కథ ప్రధానంగా ఇద్దరు ప్రముఖ వ్యక్తులు కాకర్ల కృష్ణమనాయుడు (KKN) ఆంధ్రప్రదేశ్ లోని నర్శిపల్లి, అలానే పులిచెర్ల నుండి ఎం ఎస్ రామిరెడ్డి (MSR) నడుమ సాగుతుంది. కొన్నేళ్ల అనంతరం ఈ ఇద్దరూ కూడా విడివిడిగా పొలిటికల్ పార్టీలో చేరుతారు.
అయితే విభిన్న కులాలు, ప్రతినిధ్యాలు, బ్యాక్ గ్రౌండ్ తో ఎంటర్ అయిన ఈ ఇద్దరూ కూడా మంచి నాయకులుగా పేరు అందుకుంటారు. అయితే ఆ తరువాత ప్రముఖ సినీ నటుడు రాయపాటి చక్రధర్ రావు పొలిటికల్ ఎంట్రీ తో ఈ ఇద్దరి రాజకీయ జీవితం పలు మలుపులు తిరుగుతుంది. అనంతరం కథ ఏవిధంగా ముందుకు నడించింది అనేది మొత్తం తెర పై చూడాల్సిందే.
నటీనటుల పెర్ఫార్మన్స్ :
ఇక ఈ సిరీస్ లో కీలకంగా చెప్పుకోవాల్సింది ప్రధాన పాత్రలు చేసిన ఆది పినిశెట్టి, చైతన్య రావు ల గురించి. ఇద్దరూ కూడా తమ తమ పాత్రల్లో ఒదిగిపోయి ఎంతో అద్భుతంగా నటించారు. ఆ తరువాత సాయి కుమార్ కూడా తన పాత్రలో అలరించారు. ఐరన్ లేడీ గా దివ్యదత్తా పాత్ర కూడా ఆకట్టుకుంటుంది. ఇక ఇతర పాత్రలు చేసిన తాన్యా రవిచంద్రన్, రవీంద్ర విజయ్, శత్రు, మరియు మిగిలిన వారు కూడా బాగానే పెర్ఫార్మ్ చేసారు.
విశ్లేషణ :
గతంలో ప్రస్థానం వంటి ఆకట్టుకునే ఎమోషనల్ పొలిటికల్ ఎంటర్టైనర్ మూవీ తీసిన దేవా కట్టా తాజాగా ఈ మయసభ సిరీస్ ద్వారా రాజశేఖర్ రెడ్డి, చంద్రబాబు నాయుడుల మీద ఫిక్షనల్ కథగా ఆకట్టుకునే రీతిన తెరకెక్కించారు.
యువకులైన ఇద్దరు రాజకీయ నాయకులు ఏవిధంగా తమ రాజకీయ జీవితంలో కొనసాగి మిత్రులుగా ముందుకు నడిచారు, అనంతరం వేరు వేరు పార్టీల్లో చేరడం, కొనసాగడం వంటివి ఆకట్టుకునేలా చిత్రీకరించారు.
అయినప్పటికీ కూడా రాజకీయాల్లో వారి వారి యొక్క నడవడిక ఎలా నడిచింది అనేది కూడా బాగా తీశారు. వారిద్దరి యొక్క బాల్యం నుండి మొదలుకుని యువ రాజకీయ నాయకులుగా ఎదిగే క్రమంలో ఎటువంటి ఒడిదుడుకులు ఎదుర్కొన్నారు అనే అంశకు బాగా చూపించారు.
అయితే ప్రారంభం ఎపిసోడ్స్ లో బాగానే సాగిన ఈ సిరీస్ మధ్యలో నెమ్మదిస్తుంది. ఇద్దరి యొక్క ప్రేమ జీవితం సంబందించిన సీన్స్ అంతగా ఆకట్టుకోవు, కొంత ఫోర్స్డ్ గా అనిపిస్తాయి. వారిద్దరి స్నేహం, రాజకీయ జీవితం నడుమ వచ్చే కొన్ని సీన్స్ ని ఎంటర్టైనింగ్ గా రాసుకుని ఆకట్టుకున్నారు. RCR, శివాజీ రావుల ఎంట్రీ సీన్స్ బాగున్నాయి.
అలానే RCR, ఐరా వాసు ల మధ్య శత్రుత్వం ప్రారంభం అయ్యే సీన్స్ కూడా బాగున్నాయి. అయితే RCR రాజకీయ ఎంట్రీ సీన్స్ ని మరింత హృద్యంగా తీసి ఉండాల్సింది. మధ్యలో ఎమోషనల్ సీన్స్ లో బలమైన అంశాలు ఉండవు. లాస్ట్ ఎపిసోడ్ ఫాస్ట్ గా సాగినట్లు అనిపించినా క్లైమాక్స్ మాత్రం కొంత సీరియస్ డ్రామా నడుమ ఆకట్టుకునే రీతిన ముగుస్తుంది.
ప్లస్ పాయింట్స్:
- ప్రధాన కథాంశం
- ప్రధాన పాత్రధారుల యాక్టింగ్
- మొదటి మూడు ఎపిసోడ్‌లు
- శక్తివంతమైన సంభాషణలు/సన్నివేశాలు
మైనస్ పాయింట్స్:
- బలహీనమైన మధ్య ఎపిసోడ్స్
- కొన్ని నాటకీయ సన్నివేశాలు
- చాలా సినిమాటిక్ లిబర్టీ
తీర్పు :
మొత్తంగా దేవా కట్టా దర్శకత్వంలో తెరకెక్కిన లేటెస్ట్ పొలిటికల్ యాక్షన్ వెబ్ సిరీస్ మయసభ ఆడియన్స్ ని ఆకట్టుకుంటుందని చెప్పాలి. వాస్తవికతకు కొంత ఫిక్షనల్ అంశాలు జోడించి ఆయన తీసిన ఈ మూవీలో ప్రధాన పాత్రలని చేసిన ఆది పినిశెట్టి, చైతన్య రావు ఇద్దరూ కూడా చక్కగా యాక్ట్ చేసారు. వారి నటనతో పాటు కొన్ని పవర్ఫుల్ డైలాగులు, కొన్ని సీన్స్ ఎంతో ఎంతో ఆకట్టుకుంటాయి.