Home సినిమా వార్తలు ‘ఓజి’ నైజాం రైట్స్ కోసం ట్రై చేస్తున్న బడా నిర్మాత ?

‘ఓజి’ నైజాం రైట్స్ కోసం ట్రై చేస్తున్న బడా నిర్మాత ?

og movie

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా ప్రియాంక మోహన్ హీరోయిన్ గా యువ దర్శకుడు సుజీత్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న లేటెస్ట్ మూవీ ఓజి. ఈ పాన్ ఇండియన్ గ్యాంగ్ స్టర్ యాక్షన్ డ్రామా మూవీలో బాలీవుడ్ నటుడు ఇమ్రాన్ హష్మీ విలన్ గా చేస్తుండగా ఇతర ముఖ్య పాత్రల్లో ప్రకాష్ రాజ్, అర్జున్ దాస్, శ్రియా రెడ్డి తదితరుల నటిస్తున్నారు.

మొదటి నుండి అందరిలో మంచి అంచనాలు కల్గిన ఈ మూవీ నుండి గత ఏడాది రిలీజ్ అయిన ఫస్ట్ గ్లింప్స్ ఎంతో మంచి రెస్పాన్స్ సొంతం చేసుకోగా తాజాగా రిలీజ్ అయిన ఫస్ట్ సాంగ్ కూడా పాజిటివ్ రెస్పాన్స్ సొంతం చేసుకుంది.

ఎస్ థమన్ సంగీతం అందిస్తున్న ఈమూవీని డివివి ఎంటర్టైన్మెంట్స్ సంస్థ గ్రాండ్ గా నిర్మిస్తోంది. అయితే విషయం ఏమిటంటే సెప్టెంబర్ 25న గ్రాండ్ గా పలు భాషల ఆడియన్సు ముందుకి రానున్న ఓజి నైజం రైట్స్ ని ప్రముఖ నిర్మాత దిల్ రాజు దక్కించుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది.

కాగా అయన ఈ రైట్స్ కోసం జీఎస్టీ కలిపి రూ. 55 కోట్లకు పైగా కోట్ చేశారట. అంటే మూవీ మొత్తంగా రూ. 100 కోట్లు రాబడితేనే బ్రేకీవెన్ అందుకోవడం సాధ్యమవుతుంది. మరి ఆ రైట్స్ ని దిల్ రాజు సొంతం చేసుకుంటారో లేదో తెలియాలి అంటే మరికొద్దిరోజులు ఆగాలి.

Follow on Google News Follow on Whatsapp




Show comments
Exit mobile version