Home సినిమా వార్తలు ‘ఓజి’ సెకండ్ సాంగ్ రిలీజ్ డేట్ ఫిక్స్ ?

‘ఓజి’ సెకండ్ సాంగ్ రిలీజ్ డేట్ ఫిక్స్ ?

og

పవర్ స్టార్ పవన్ కళ్యణ్ హీరోగా యువ దర్శకుడు సుజీత్ తెరకెక్కిస్తున్న లేటెస్ట్ మాస్ గ్యాంగ్ స్టర్ యాక్షన్ ఎంటర్టైనర్ పాన్ ఇండియన్ మూవీ ఓజి.

ఈ మూవీలో అందాల నటి ప్రియాంక మోహన్ హీరోయిన్ గా నటిస్తుండగా దీనిని గ్రాండ్ లెవెల్లో డివివి ఎంటర్టైన్మెంట్స్ సంస్థ నిర్మిస్తుండగా ఎస్ థమన్ మ్యూజిక్ అందిస్తున్నారు. ఫస్ట్ గ్లింప్స్ తోనే విపరీతమైన క్రేజ్ సొంతం చేసుకున్న ఓజి మూవీ సెప్టెంబర్ 25న గ్రాండ్ గా పలు భాషల ఆడియన్స్ ముందుకి రానుంది.

తాజాగా రిలీజ్ అయిన ఫస్ట్ సాంగ్ ఫైర్ స్టార్మ్ మంచి రెస్పాన్స్ అందుకోగా లేటెస్ట్ టాలీవుడ్ బజ్ ప్రకారం ఓజి నుండి సెకండ్ సాంగ్ ని రానున్న వినాయకచవితి రోజున ఆగష్టు 27న రిలీజ్ చేయనున్నారట. ఈ సాంగ్ పవన్, ప్రియాంక మధ్య సాగె మెలోడీ సాంగ్ అట.

అక్కడి నుండి ప్రమోషన్స్ పై టీమ్ గట్టిగా మొదలెట్టనుందని, హరి హర వీర మల్లు తో ఘోరమైన డిజాస్టర్ చవిచూసిన పవన్ తప్పకుండా ఈ మూవీతో భారీ సక్సెస్ సొంతం చేసుకోవడం ఖాయం అని టాలీవుడ్ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. ఓజి టీమ్ కూడా మూవీ అవుట్ ఫుట్ పై బాగా నమ్మకంగా ఉంది.

Follow on Google News Follow on Whatsapp




Exit mobile version