Home సినిమా వార్తలు ఆ విషయంలో అల్లు అర్జున్ సక్సెస్, నితిన్ ఫెయిల్ : దిల్ రాజు

ఆ విషయంలో అల్లు అర్జున్ సక్సెస్, నితిన్ ఫెయిల్ : దిల్ రాజు

allu arjun nithin

ప్రముఖ నిర్మాత దిల్ రాజు ప్రతిష్టాత్మకంగా నిర్మించిన తాజా సినిమా తమ్ముడు జూలై 4న ఆడియన్స్ ముందుకు రానుంది. నితిన్ హీరోగా రూపొందిన ఈ సినిమాలో సప్తమి గౌడ, వర్ష బొల్లమ్మ, లయ తదితరులు కీలకపాత్రల్లో నటించారు.

ఇక ఈ సినిమా ప్రమోషన్ ఇంటర్వ్యూస్ సందర్భంగా ఒక ఇంటర్వ్యూలో దిల్ రాజు మాట్లాడుతూ తమ బ్యానర్ నుంచి కొన్నేళ్ల క్రితం రిలీజ్ అయిన సినిమాల్లో దిల్, ఆర్య రెండు సినిమాలతో నటులుగా అటు నితిన్ ఇటు అల్లు అర్జున్ ఇద్దరు కూడా మంచి క్రేజ్ అందుకున్నారని అన్నారు.

అయితే రాను రాను కెరీర్ పరం అల్లు అర్జున్ తారస్థాయికి చేరితే నితిన్ మాత్రం ఆశించిన స్థాయిలో సక్సెస్ కాలేకపోయాడని నితిన్ ఉద్దేశించి సరదాగా కామెంట్ చేశారు. దిల్ రాజు అయితే వాస్తవం చెప్పారనాలి.

హీరో నితిన్ ఎస్ఎస్ రాజమౌళి, వినాయక్, తేజ, కృష్ణవంశీ, పూరి జగన్నాథ్ వంటి టాలెంటెడ్ దర్శకులతో పనిచేసినప్పటికీ స్క్రిప్టుల సెలక్షన్స్ విషయంలో ఒకింత పెద్దగా సక్సెస్ అందుకోలేదు. అయితే అల్లు అర్జున్ మాత్రం తన స్క్రిప్టులు సెలక్షన్ పరంగా ఆకట్టుకునే రీతిన ఎంచుకుని మంచి విజయాలు అందుకొని ప్రస్తుతం తారాపథంలో దూసుకెళ్తున్న విషయం తెలిసిందే.

Follow on Google News Follow on Whatsapp




Show comments
Exit mobile version