Home సినిమా వార్తలు ‘తమ్ముడు’ పెయిడ్ ప్రీమియర్స్ రెడీ

‘తమ్ముడు’ పెయిడ్ ప్రీమియర్స్ రెడీ

thammudu

నితిన్ హీరోగా శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై వేణు శ్రీరామ్ దర్శకత్వంలో దిల్ రాజు నిర్మించిన తాజా సినిమా తమ్ముడు. ఈ మూవీలో వర్ష బొల్లమ్మ, సప్తమి గౌడ, స్వశిక. సౌరభ్ సచ్ దేవ్ తదితరులు కీలక పాత్రలు చేస్తున్నారు.

ఈ మూవీకి అజనీష్ లోకనాథ్ సంగీతం అందించగా మూవీని జులై 4న గ్రాండ్ గా ఆడియన్స్ ముందుకి తీసుకురానున్నారు. ఇప్పటికే రిలీజ్ అయిన ప్రచార చిత్రాలతో పర్వాలేదనిపించే క్రేజ్ సొంతం చేసుకున్న తమ్ముడు మూవీ యొక్క పెయిడ్ ప్రీమియర్స్ ని జులై 3న తెలుగు రాష్ట్రాల్లోని పలు ఏరియాస్ లో ప్రదర్శించనున్నారు.

దాదాపుగా రూ. 75 కోట్ల భారీ వ్యయంతో తమ టీమ్ అందరం నిర్మించిన తమ్ముడు మూవీ తప్పకుండా అందరినీ ఆకట్టుకుంటుందని, కంటెంట్ మీద నమ్మకంతోనే పెయిడ్ ప్రీమియర్స్ ని ధైర్యంగా ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు నిర్మాత దిల్ రాజు.

హీరో నితిన్, దర్శకుడు వేణుతో పాటు టీమ్ మొత్తం కూడా తమ్ముడు మూవీ కోసం ఎంతో కష్టపడ్డారని, ఖచ్చితంగా మూవీ కంటెంట్ ఆడియన్స్ కి సరికొత్త అనుభూతిని అందిస్తుందని ఆ విధంగా స్క్రీన్ ప్లే ఉంటుందని దిల్ రాజు అంటున్నారు. మరి రిలీజ్ అనంతరం తమ్ముడు ఎంతమేర సక్సెస్ అవుతుందో చూడాలి.

Follow on Google News Follow on Whatsapp




Exit mobile version