ఇటీవల రామ్ చరణ్ హీరోగా దిల్ రాజు నిర్మించిన పాన్ ఇండియన్ పొలిటికల్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ గేమ్ ఛేంజర్. ఈ మూవీలో బాలీవుడ్ నటి కియారా అద్వానీ హీరోయిన్ గా నటించిన ఈ మూవీలో సముద్రఖని, రాజీవ్ కనకాల, శ్రీకాంత్, ఎస్ జె సూర్య తదితరులు ముఖ్య పాత్రల్లో నటించారు.
ఎస్ థమన్ సంగీతం అందించిన ఈ మూవీకి తీరు ఫోటోగ్రఫీ అందించారు. అయితే మంచి అంచనాలు నడుమ రిలీజ్ అయిన ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద ఘోరంగా డిజాస్టర్ గా నిలిచిన విషయం తెలిసిందే.
ఇక ఇటీవల ఒక మీడియా ఇంటర్వ్యూలో భాగంగా గేమ్ చేంజర్ నిర్మాతల్లో ఒకరైన శిరీష్ మాట్లాడుతూ సినిమా ప్లాప్ అయిన తర్వాత దర్శకుడు శంకర్ గానీ హీరో రామ్ చరణ్ గానీ తమకి ఫోన్ చేసింది లేదని ఆవేదన వ్యక్తం చేశారు. దానితో ఆ వ్యాఖ్యల పై సోషల్ మీడియాతో పాటు రామ్ చరణ్ ఫాన్స్ లో కూడా తీవ్ర దుమారం రేగింది.
కావాలనే తమ హీరోని టార్గెట్ చేయడం సరైనది కాదని రామ్ చరణ్ ఫాన్స్ శిరీష్ పై విమర్శలు ఎక్కు పెట్టారు. మొత్తంగా నిన్న శిరీష్ తాను మాట్లాడిన మాటలు అభ్యంతరంగా ఉంటే అలానే ఎవరినైనా నొప్పించి ఉంటే తాను మనస్ఫూర్తిగా క్షమాపణ చెప్తున్నట్లు ఒక ప్రెస్ నోట్ అయితే రిలీజ్ చేశారు