Home సినిమా వార్తలు అవి నాని అంచనాలను నిజం చేసేనా ?

అవి నాని అంచనాలను నిజం చేసేనా ?

nani

నాచురల్ స్టార్ నాని హీరోగా ఇటీవల వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో తెరకెక్కిన యాక్షన్ సినిమా సరిపోదా శనివారం. ఈ మూవీ మంచి అంచనాలతో రిలీజ్ అయి బాక్సాఫీస్ వద్ద విజయం సొంతం చేసుకుంది. దాని అనంతరం ప్రస్తుతం నాని చేస్తున్న సినిమా హిట్ 3. హిట్ ఫ్రాంచైజ్ లో వచ్చిన గత రెండు సినిమాలు బాగానే విజయం అందుకోవటంతో ఈ సినిమాపై మరింత క్రేజ్ వచ్చింది. ఇటీవల రిలీజ్ అయిన హిట్ 3 టీజర్, ట్రైలర్ కి కూడా బాగా రెస్పాన్స్ వచ్చింది.

ఇక తాజాగా ఒక ఇంటర్వ్యూలో భాగంగా నాని ఈ మూవీ గురించి కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు తెలిపారు. ఆయన మాట్లాడుతూ ఈ హిట్ 3 మూవీలో వైలెన్స్ కూడా ఎక్కువగానే ఉంటుందని ఆకట్టుకునే కథ కథనాలతో దర్శకుడు శైలేష్ కొలను దీనిని తెరకెక్కిస్తారని అన్నారు. ఈ సినిమాలో తమిళ చిత్ర పరిశ్రమకు చెందిన ఒక నటుడు ఒక ప్రత్యేక పాత్రలో కనిపించనున్నారని దాని అనంతరం తదుపరి ఈ ఫ్రాంచైజ్ లో రానున్న సినిమాలు మరింతగా హిట్ అయ్యే విధంగా దర్శకుడు శైలేష్చె స్క్రిప్ట్స్ సిద్ధం చేసుకుంటున్నట్లు చెప్పుకొచ్చారు.

ఒక ఆపైన చేయనున్న ది ప్యారడైజ్ మూవీ కూడా శ్రీకాంత్ అద్భుతంగా తెరకెక్కించనున్నాడని తప్పకుండా ఇకపై తన నుండి వచ్చే సినిమాలన్నీ కూడా మంచి విజయవంతం అయ్యేలా కథలు తాను సెలెక్ట్  చేసుకుంటున్నట్టు చెప్పుకొచ్చారు నాని. ఇక ప్యారడైజ్ లో బూతులు వాడారు కథ అంటే అవి కథానుసారం వచ్చినవే తప్ప కావాలని ఉపయోగించలేదని, రేపు థియేటర్ పై ఈ రెండు సినిమాలు చూసి ఆడియన్స్ మంచి రెస్పాన్స్ అందిస్తారనే నమ్మకం తనకు ఉందన్నారు నాని. మరి ఇవి ఆయన కెరీర్ కి ఎంతవరకు ప్లస్ అవుతాయో ఎంతమేర విజయాలు అందుకుంటాయో చూడాలి.  

Follow on Google News Follow on Whatsapp




Show comments
Exit mobile version