Home సినిమా వార్తలు ఒకే బాటలో నడుస్తున్న RC 16, SSMB 29 

ఒకే బాటలో నడుస్తున్న RC 16, SSMB 29 

mahesh babu ram chaan

టాలీవుడ్ స్టార్ యాక్టర్స్ సూపర్ స్టార్ మహేష్ బాబు, గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ఇద్దరూ కూడా ప్రస్తుతం తమ సినిమాలతో షూటింగ్స్ పరంగా బిజీ బిజీగా కొనసాగుతున్న సంగతి తెలిసిందే. 

ప్రస్తుతం బుచ్చి బాబు సనతో రామ్ చరణ్ RC 16 మూవీ చేస్తుండగా, మరోవైపు దిగ్గజ దర్శకుడు ఎస్ ఎజ్రా రాజమౌళితో ప్రతిష్టాత్మక పాన్ వరల్డ్ మూవీ SSMB 29 చేస్తున్నారు మహేష్ బాబు. ఈ రెండు క్రేజీ కాంబినేషన్ మూవీస్ పై అందరిలో భారీ స్థాయిలో అంచనాలు ఉన్నాయి. ఇక రామ్ చరణ్ మూవీని వెంకట సతీష్ కిలారు గ్రాండ్ గా నిర్మిస్తున్నారు. 

స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ లో రూపొందుతున్న ఈమూవీలో జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తుండగా ఏ ఆర్ రహమాన్ సంగీతం సమకూరుస్తున్నారు. ప్రస్తుతం ఈ మూవీ వేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. అలానే మహేష్ SSMB 29 మూవీ ఇప్పటికే రెండు షెడ్యూల్స్ జరుపుకోగా మూడవ షెడ్యూల్ ని మరొక వారం అనంతరం హైదరాబాద్ లో జరుపనున్నారు. 

విషయం ఏమిటంటే, ప్రస్తుతం ఈ రెండు సినిమాలు కూడా ప్రస్తుతం ఒక బాటలో నడుస్తున్నాయి. ఇటీవల భారీ బడ్జెట్ సినిమాల యొక్క చిత్రీకరణ ఎంతో ఆలస్యం అవుతుండడంతో పలువురి నుండి విమర్శలు ఎదురవుతున్నాయి. అందుకే ఇకపై తమ సినిమాల విషయంలో అలా జరుగకుండా ఇవి రెండూ కూడా వేగంగా చిత్రికరణ జరుపుకుంటున్నాయి. 

ముందుగానే చకచకా ప్రి ప్రొడక్షన్ పనులు పూర్తి చేసి షూటింగ్ షెడ్యూల్ లు త్వరగా పూర్తి చేసేస్తున్నారు. గతంలో కూడా పలు సినిమాలు ఇలానే చేసి ఫాస్ట్ గా పూర్తి చేసి అనుకున్న టైం కి రిలీజ్ చేసేవారని, ఒకరకంగా ఇకపై ఇటువంటి పెద్ద సినిమాలు కూడా ఇదే బాటన నడుస్తుండడం శుభపరిణామం అంటున్నారు సినీ విశ్లేషకులు. 

Follow on Google News Follow on Whatsapp




Show comments
Exit mobile version