Home సినిమా వార్తలు దిల్ రాజు – మార్కో డైరెక్టర్ మూవీ ఫుల్ డీటెయిల్స్ 

దిల్ రాజు – మార్కో డైరెక్టర్ మూవీ ఫుల్ డీటెయిల్స్ 

dil raju

ఇటీవల మలయాళంలో ఉన్ని ముకుందన్ హీరోగా యువ దర్శకుడు హనీఫ్ అదేని దర్శకత్వంలో తెరకెక్కిన యాక్షన్ మూవీ మార్కో. ఈ మూవీ మలయాళంలో మంచి విజయం అందుకున్న అనంతరం తెలుగులో కూడా డబ్ కాబడి బాగానే ఆకట్టుకుంది. 

అయితే మూవీ పై కొందరు విమర్శలు ఎక్కుపెట్టారు. దర్శకుడు ఎంచుకున్న కథ, కథనాలు, తెరకెక్కించిన తీరు అంతా బాగున్నప్పటికీ ఊహించలేనంత ఎక్కువగా వయొలెన్స్ ఉండడంతో కొన్ని వర్గాల ఆడియన్స్ మూవీకి దూరమయ్యారు. 

అయితే ఈ మూవీతో దర్శకుడిగా మంచి పేరు సొంతం చేసుకున్న అనీఫ్, తాజాగా టాలీవుడ్ దిగ్గజ నిర్మాత దిల్ రాజుతో తన నెక్స్ట్ మూవీ చేసేందుకు సిద్ధమయ్యారు. ఇటీవల వీరిద్దరి కలయిక జరుగడం, అలానే ఒక క్రేజీ కాంబినేషన్ మూవీకి బీజం పడడం జరిగిపోయింది. ఈ మూవీ ఒక క్రేజీ మల్టీస్టారర్ అని తెలుస్తోంది. 

కాగా ఈ మూవీ యొక్క పూర్తి స్క్రిప్ట్ కూడా లాక్ అయ్యిందట. ఇందులో ఇద్దరు హీరోలు ఉండనుండగా ఒక సీనియర్ హీరో అలానే ఒక మిడ్ రేంజ్ హీరో ఉంటారట. అలానే ఇందులో కీలకమైన విలన్ క్యారెక్టర్ లో కూడా ఒక హీరో రేంజ్ యాక్టర్ నటించనున్నారట. ఫైనల్ గా ,మరొక వారం రెండు వారాల్లో దీనిపై పూర్తి క్లారిటీ వస్తుందని అనంతరం దీని గురించిన పూర్తి వివరాలు అధికారికంగా వెల్లడవుతాయని తెలుస్తోంది. 

Follow on Google News Follow on Whatsapp




Show comments
Exit mobile version