Home సినిమా వార్తలు రూ. 200 కోట్ల క్లబ్ లో ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’

రూ. 200 కోట్ల క్లబ్ లో ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’

good bad ugly

కోలీవుడ్ స్టార్ యాక్టర్ అజిత్ కుమార్ హీరోగా అధిక్ రవిచంద్రన్ దర్శకత్వంలో తెరకెక్కిన తాజా యాక్షన్ గ్యాంగ్ స్టర్ డ్రామా మూవీ గుడ్ బాడ్ అగ్లీ. ఇటీవల మంచి అంచనాలతో ఆడియన్స్ ముందుకు వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మిక్స్డ్ టాక్ అందుకుని ప్రస్తుతం మంచి కలెక్షన్ తో కొనసాగుతుంది. ఆడియన్స్ నుండి యావరేజ్ టాక్ అందుకున్నప్పటికీ అజిత్ ఫ్యాన్స్ ఈ సినిమాకు బాగా కనెక్ట్ అవుతున్నారు. 

ఇతర ప్రాంతాల కంటే తమిళనాడులో గుడ్ బ్యాడ్ అగ్లీ మూవీ బాగా కలెక్షన్లు రాబడుతుంది. జీవి ప్రకాష్ కుమార్ సంగీతం అందించిన ఈ సినిమాని టాలీవుడ్ ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ భారీ వ్యయంతో నిర్మించారు. ఇందులో స్టార్ నటి త్రిష కృష్ణన్ హీరోయిన్ గా నటించారు. ఇక ప్రస్తుతం ఈ సినిమా వరల్డ్ వైడ్ గా ఓవరాల్ రూ. 200 కోట్లకు పైగా గ్రాస్ ని సొంతం చేసుకొని అజిత్ కెరీర్ లో రూ. 200 కోట్ల మార్కు దాటిన రెండో సినిమాగా నిలిచింది. 

ఇటీవల ఆయన నటించిన తునివు కూడా రూ. 200 కోట్లు గ్రాస్ ని దక్కించుకున్న చేసిన విషయం తెలిసిందే. అజిత్ పవర్ఫుల్ పర్ఫామెన్స్ తో పాటు మాస్ యాక్షన్ సన్నివేశాలు ఎలివేషన్స్, బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ వంటివి గుడ్ బ్యాడ్ అగ్లీ లో అందరిని ఆకట్టుకుంటున్నాయి. 

ఇక ప్రస్తుతం ఈ సినిమా యొక్క బాక్సాఫీస్ రన్ ని బట్టి చూస్తే ఇది ఓవరాల్ గా రూ. 250 కోట్లు దాటేస్తుందని ట్రేడ్ అనలిస్టులు అంచనా వేస్తున్నారు. ఇక ఈ సినిమాతో తమిళ్ లో టాలీవుడ్ నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ మంచి విజయం అందుకుని త్వరలోనే అక్కడ మరింత మంది స్టార్స్ తో సినిమాలు చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. 

Follow on Google News Follow on Whatsapp




Show comments
Exit mobile version