Home సినిమా వార్తలు మైత్రి మూవీ మేకర్స్ టీమ్ కి ఇళయరాజా లీగల్ నోటీసులు

మైత్రి మూవీ మేకర్స్ టీమ్ కి ఇళయరాజా లీగల్ నోటీసులు

ilayaraja

కోలీవుడ్ స్టార్ యాక్టర్ అజిత్ కుమార్ హీరోగా త్రిష హీరోయిన్ గా యువ దర్శకుడు అధిక్ రవిచంద్రన్ దర్శకత్వంలో తెరకెక్కిన లేటెస్ట్ మూవీ గుడ్ బ్యాడ్ అగ్లీ. ఈ మూవీకి జివి ప్రకాష్ కుమార్ సంగీతం అందించగా కీలక పాత్రల్లో ఎస్ జె సూర్య, సునీల్, షైన్ టామ్ చాకో, అర్జున్ దాస్ తదితరులు నటించారు.

తెలుగు అగ్ర నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ వారు నిర్మించిన ఈ మూవీకి అభినందన్ రామానుజం ఫోటోగ్రఫి అందించారు. ఇటీవల మంచి అంచనాలతో ఆడియన్స్ ముందుకి వచ్చిన ఈ మూవీ మిక్స్డ్ టాక్ సొంతం చేసుకుని ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద కొనసాగుతోంది. అయితే తమిళనాడులో మాత్రం గుడ్ బ్యాడ్ అగ్లీ మూవీకి మరింతగా కలెక్షన్స్ లభిస్తున్నాయి.

ఆ మూవీ టీమ్ హ్యాపీగా ఉన్న తరుణంలో లెజెండరీ సంగీత దర్శకుడు ఇళయరాజా వారికి పెద్ద షాక్ ఇచ్చారు. ఈ మూవీలో తన మూడు పాటలను ఉపయోగించినందుకు రూ. 5 కోట్ల రూపాయల పరిహారం డిమాండ్ చేస్తూ నిర్మాతలకు లీగల్ నోటీసులని ఆయన పంపించారు.

అనుమతి లేకుండా తన పాటలను ఉపయోగించినందుకు ఆ పాటలను వెంటనే తొలగించి 7 రోజుల్లోపు బేషరతుగా క్షమాపణ చెప్పాలని ఆయన వారిని కోరారు. మరోవైపు, మైత్రి వారు మాట్లాడుతూ, ఆయా మ్యూజిక్ కంపెనీల నుండి అవసరమైన అనుమతులు పొందామని, అయితే దీనికి సంగీత దర్శకుడు అంగీకరించలేదని చెబుతున్నారు. మరి ఈ ఘటన మున్ముందు ఏవిధంగా ముందుకు సాగుతుందో చూడాలి.

Follow on Google News Follow on Whatsapp




Exit mobile version