కోలీవుడ్ స్టార్ యాక్టర్ సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా ప్రస్తుతం రెండు సినిమాలు రూపొందుతున్నాయి. అవి నెల్సన్ దిలీప్ కుమార్ తీస్తున్న జైలర్ 2, అలానే లోకేష్ కనకరాజ్ తీస్తున్న కూలీ. ఈ రెండు సినిమాల పై తమిళ్ తో పాటు పలు ఇతర భాషల ఆడియన్స్ లో కూడా ఎన్నో అంచనాలు నెలకొని ఉన్నాయి.
అయితే వీటిలో ముందుగా ఈ ఏడాది ఆగష్టు 14న కూలీ మూవీ రిలీజ్ కానుంది. తనకు ఇష్టమైన సూపర్ స్టార్ తో చేస్తున్న మూవీ కావడంతో దర్శకుడు లోకేష్ కూలీ కి సంబంధించి ప్రతి విషయంలో ఎంతో జాగ్రత్త తీసుకుని దీనిని తెరకెక్కిస్తున్నారు. శృతి హాసన్, అమీర్ ఖాన్, నాగార్జున, ఉపేంద్ర తదితరులు కీలక పాత్రలు చేస్తున్న ఈ మూవీలో రజిని పాత్ర పవర్ఫుల్ గా ఉంటుందట.
ఇటీవల కూలీ నుండి రిలీజ్ అయిన ఫస్ట్ సాంగ్, అనౌన్స్ మెంట్ గ్లింప్స్ బాగానే రెస్పాన్స్ అందుకున్నాయి. అనిరుద్ రవిచందర్ సంగీతం అందిస్తున్న ఈ మూవీతో ఎన్టీఆర్, హృతిక్ రోషన్ ల భారీ మూవీ వార్ 2 బాక్సాఫీస్ వద్ద క్లాష్ కి సిద్ధమైంది. ఈ మూవీని అయాన్ ముఖర్జీ తెరకెక్కిస్తుండగా బాలీవుడ్ అగ్ర నిర్మాణ సంస్థ యష్ రాజ్ ఫిలిమ్స్ వారు గ్రాండ్ గా నిర్మిస్తున్నారు.
కాగా తమ మూవీని కూడా పక్కాగా ఆగష్టు 14న రిలీజ్ చేస్తున్నట్లు తాజాగా టీమ్ తెలిపింది. ఇక ఈ మూవీలో కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తోంది. బాక్సాఫీ పరంగా చూస్తే కూలీ, వార్ 2 రెండు మూవీస్ పై ఆడియన్స్ లో ఫ్యాన్స్ లో విపరీతమైన క్రేజ్ ఉంది. తొలిసారిగా ఎన్టీఆర్ తో హృతిక్ నటిస్తుండడంతో ఆ కాంబినేషన్ తెరపై చూడాలని ఇద్దరు హీరోల ఫ్యాన్స్ ఎంతో ఉత్సాహంగా ఎదురు చూస్తున్నారు.
ఇక తొలిసారిగా రజినీతో తీస్తున్న మూవీ కావడంతో కూలీలో తమ అభిమాన సూపర్ స్టార్ ని లోకేష్ ఎలా చూపిస్తారో చూడాలని రజిని ఫ్యాన్స్ ఆసక్తికరంగా చూస్తున్నారు. మొత్తంగా అటు ప్రీ రిలీజ్ పరంగా కూడా రెండు సినిమాలు మంచి బిజినెస్ ని జరుపుకునే అవకాశం ఉంది. ఆ విధంగా అన్నింటా మంచి పొటెన్షియల్ కలిగిన ఈ రెండు సినిమాల్లో ఏది ఏ స్థాయి విజయం అందుకుంటుందో తెలియాలి అంటే మరికొద్ది నెలలు ఆగాల్సిందే.