Home సినిమా వార్తలు సింగర్ గా మెగాస్టార్ చిరంజీవి ?

సింగర్ గా మెగాస్టార్ చిరంజీవి ?

Vishwambhara

ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి యువ దర్శకుడు వశిష్ట తో చేస్తున్న మూవీ విశ్వంభర. ఈ మూవీలో భీమవరం దొరబాబు పాత్రలో మెగాస్టార్ నటిస్తుండగా, దీనిని గ్రాండ్ లెవెల్లో భారీ సోషియో ఫాంటసి ఎంటర్టైనర్ గా దర్శకుడు తెరకెక్కిస్తున్నారు. త్రిష హీరోయిన్ గా నటిస్తున్న ఈ మూవీలో బాలీవుడ్ నటుడు కునాల్ కపూర్ విలన్ గా నటిస్తుండగా దీనిని యువి క్రియేషన్స్ బ్యానర్ పై వంశీ కృష్ణా రెడ్డి, ప్రమోద్ ఉప్పలపాటి, విక్రమ్ రెడ్డి నిర్మిస్తున్నారు.

ఈ మూవీకి కీరవాణి సంగీతం అందిస్తుండగా మెగాస్టార్ కి చెల్లెళ్లుగా ఆషిక రంగనాథ్, సురభి, ఇషా చావ్లా నటిస్తున్నారు. ఇప్పటికే చాలా వరకు షూటింగ్ జరుపుకున్న ఈ మూవీ యొక్క ఫస్ట్ లుక్ గ్లింప్స్ టీజర్ ఇటీవల రిలీజ్ అయింది. అయితే అందులో విజువల్ ఎఫెక్ట్స్ సరిగ్గా లేకపోవడంతో విమర్శల పాలయింది.

దానితో విజువల్ ఎఫెక్ట్స్ పై గట్టిగా దృష్టి పెట్టిన విశ్వంభర మూవీ టీమ్, పూర్తిగా వి క్వాలిటీ గా వచ్చిన అనంతరం రిలీజ్ ప్లాన్ చేయాలని భావించారట. ఇక ఈమూవీకి సంబంధించి ప్రస్తుతం ఒక న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దాని ప్రకారం ఈ మూవీలో మెగాస్టార్ చిరంజీవి ఒక పాట పడనున్నారట.

ఈ సాంగ్ ని కీరవాణి అద్భుతంగా కంపోజ్ చేసారని, చాలా ఏళ్ళ తరువాత ఆయన పడనున్న ఈ సాంగ్ ఫ్యాన్స్ తో పాటు ఆడియన్స్ ని కూడా ఆకట్టుకుంటుందని టాక్. అయితే దీని పై విశ్వంభర మేకర్స్ నుండి అధికారికంగా న్యూస్ బయటకు రావాల్సి ఉంది. 

Follow on Google News Follow on Whatsapp




Show comments
Exit mobile version