మెగాస్టార్ చిరంజీవి హీరోగా ప్రస్తుతం మల్లిడి వశిష్ట దర్శకత్వంలో తెరకెక్కుతోన్న భారీ ప్రతిష్టాత్మక సోషియో ఫాంటసీ యాక్షన్ సినిమా విశ్వంభర. ఈ సినిమాలో త్రిష హీరోయిన్ గా నటిస్తుండగా ఇందులో భీమవరం దొరబాబు పాత్రలో ఆకట్టుకునే తన మార్క్ మేనరిజమ్స్, స్టైల్ తో మెగాస్టార్ చిరంజీవి అందరిని అలరిస్తారని టాక్.
ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాకి సంబంధించి సెకండ్ హాఫ్ లో వచ్చే ఒక భారీ యాక్షన్ సీన్ ని తాజాగా చిత్రీకరిస్తోందట మూవీ టీం. కాగా నేటితో దాన్ని పూర్తి చేయనున్నారట. రియల్ సతీష్ మాస్టర్ కొరియోగ్రఫీలో ఈ యాక్షన్ సన్నివేశాలు రూపొందుతుండగా ఓవరాల్ గా సినిమాని అన్ని వర్గాల ఆడియన్స్, మెగా ఫ్యాన్స్ ని అలరించేలా దర్శకుడు వశిష్ట అద్భుతంగా తెరకెక్కిస్తున్నట్లు చెబుతున్నారు.
ఇటీవల విశ్వంభర నుండి రిలీజ్ అయిన ఫస్ట్ గ్లింప్స్ టీజర్ లో విఎఫ్ఎక్స్ వర్క్ పై భారీ విమర్శలు వెల్లువెత్తాయి. దానితో ఆ విషయమై గట్టి జాగ్రత్తలు తీసుకుంటున్న టీం, వి ఎఫ్ ఎక్స్ పరంగా పూర్తిగా మంచి క్వాలిటీ అందించేందుకు ప్లాన్ చేస్తున్నారట.
ఎం ఎం కీరవాణి సంగీతం అందిస్తున్న ఈ సినిమాని యువీ క్రియేషన్స్ సంస్థ గ్రాండ్ లెవెల్ లో నిర్మిస్తోంది. ఇక అందుతున్న సమాచారం ప్రకారం విశ్వంభర సినిమా మేలో ఆడియన్స్ ముందుకు వచ్చే అవకాశం కనబడుతోంది. అయితే దీనిపై మేకర్స్ నుంచి అఫీషియల్ గా అనౌన్స్మెంట్ మాత్రం రావాల్సిందే.