ఇటీవల సంక్రాంతి పండుగ కానుకగా ప్రముఖ దర్శకుడు శంకర్ దర్శకత్వంలో నటించిన గేమ్ చేంజర్ సినిమా ద్వారా ఆడియన్స్ ముందుకు వచ్చారు గ్లోబల్ స్టార్ రామ్ చరణ్. ఈ సినిమాలో కియారా అద్వానీ హీరోయిన్ గా నటించగా కీలకపాత్రల్లో ఎస్ జె సూర్య, అంజలి, సునీల్, బ్రహ్మానందం, సముద్రఖని, శ్రీకాంత్ నటించారు. భారీ స్థాయిలో తెరకెక్కిన ఈ పొలిటికల్ యాక్షన్ మూవీ బాక్సాఫీస్ వద్ద రిలీజ్ అనంతరం అతిపెద్ద డిజాస్టర్ గా నిలిచింది.
ఇక దీని తరువాత ప్రస్తుతం ఉప్పెన దర్శకుడు బుచ్చిబాబు సనతో చరణ్ చేస్తున్న సినిమా RC16. స్పోర్ట్స్ యాక్షన్ డ్రామాగా ఆకట్టుకునే కథ కథనాలతో రూపొందుతున్న ఈ సినిమాని సుకుమార్ రైటింగ్స్, మైత్రి మూవీ మేకర్స్, సంస్థలతో కలిసి తన వృద్ధి సినిమాస్ సంస్థపై యువ నిర్మాత వెంకట సతీష్ కిలారు గ్రాండ్ లెవెల్ లో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు.
ఈ సినిమాకి ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నారు. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ మూవీలో జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తోంది. అయితే విషయం ఏమిటంటే ఎక్కువ బ్రేకులు లేకుండా ఈ మూవీ యొక్క షూట్ ని దర్శకుడు బుచ్చిబాబు లాగించేస్తున్నారట. అలానే ఇందులో పెద్దగా విఎఫ్ఎక్స్ కు సంబంధించిన సీన్స్ కూడా ఉండవని, ఉన్న కొద్దిపాటి విఎఫ్ఎక్స్ సీన్స్ ని కూడా షూటింగ్ తో పాటు వేగంగా చేయిస్తున్నారట.
అలానే ఈ ఏడాదే మూవీని ఆడియన్స్ ముందుకి తీసుకువచ్చేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారట దర్శకుడు బుచ్చి బాబు. కాగా రంగస్థలం తర్వాత ఈ సినిమాలో రామ్ చరణ్ పాత్ర మరింత అద్భుతంగా ఉండడంతో పాటు దీని గురించి అందరూ మాట్లాడుకుంటారని టాక్.