Home సినిమా వార్తలు Mazaka Two Days Worldwide Collections ‘​మజాకా’ రెండు రోజుల వరల్డ్ వైడ్ బాక్సాఫీస్ కలెక్షన్

Mazaka Two Days Worldwide Collections ‘​మజాకా’ రెండు రోజుల వరల్డ్ వైడ్ బాక్సాఫీస్ కలెక్షన్

mazaka

​యువ నటుడు సందీప్ కిషన్ హీరోగా రీతు వర్మ హీరోయిన్ గా త్రినాధరావు నక్కిన దర్శకత్వంలో హాస్యం మూవీస్ బ్యానర్ పై రాజేష్ దండా గ్రాండ్ గా నిర్మించిన లేటెస్ట్ లవ్ ఎమోషనల్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ సినిమా మజాకా. ప్రారంభం నాటి నుంచి అందరిలో మంచి అంచనాలు ఏర్పరిచిన ఈ సినిమాలో రావు రమేష్, అన్షు కీలకపాత్రల్లో కనిపించారు. 

దీనికి లియోన్ జేమ్స్ సంగీతం సమకూర్చారు. ఫిబ్రవరి 25న ప్రీమియర్స్ తో ప్రారంభమైన ఈ సినిమా మంచి రెస్పాన్స్ అందుకుంది. అనంతరం 26న గ్రాండ్ లెవెల్ లో భారీ స్థాయిలో థియేటర్స్ లో రిలీజ్ అయిన మజాకా సినిమా పాజిటివ్ రెస్పాన్స్ అయితే సంపాదించుకుంది. కాగా ప్రస్తుతం థియేటర్స్ వద్ద ఆశించిన స్థాయి కలెక్షన్స్ అయితే ఈ సినిమాకు రావటం లేదు. ఇక రెండో రోజు ఈ సినిమాకి పెద్దగా కలెక్షన్ రాలేదు. 

ప్రస్తుతం మిడ్ వీక్ కావటంతో రెండు రోజుల్లో కలిపి మజాకా రూ. 4 కోట్ల గ్రాస్ ని అంటే రూ. 1.5 కోట్ల షేర్ మాత్రమే అందుకుంది. ఇక ఈ సినిమా బ్రేక్ ఈవెన్ సాధించాలంటే రూ. 12 కోట్ల షేర్ ను అయితే సంపాదించాలి. ఇక రేపటి నుంచి ఈ మూవీకి వీకెండ్ కావడంతో ఆ రెండు రోజులు బాగానే కలెక్షన్ వచ్చే అవకాశం కనబడుతుంది. 

మరోవైపు టీం కూడా మూవీకి కచ్చితంగా రాబోయే రోజుల్లో మరింతగా ఆడియన్స్ రెస్పాన్స్ అందుకుంటుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. సందీప్ కిషన్, రీతు వర్మల జోడితోపాటు రావు రమేష్, అన్షు జోడి కూడా థియేటర్స్ లో ఆడియన్స్ మెప్పిస్తోందని కామెడీ ఎంటర్టైన్మెంట్ తో పాటు ఎమోషన్ కూడా అందరికీ కనెక్ట్ అవుతోందని ఓవరాల్ గా తమ సినిమా మంచి విజయం అందుకున్నందుకు ఆనందంగా ఉందని అంటున్నారు టీం సభ్యులు. 

Follow on Google News Follow on Whatsapp




Show comments
Exit mobile version