Home సినిమా వార్తలు Vidaamuyarchi Big Disaster than Valimai ‘వలిమై’ కంటే పెద్ద డిజాస్టర్ గా నిలిచిన ‘విడాముయార్చి’

Vidaamuyarchi Big Disaster than Valimai ‘వలిమై’ కంటే పెద్ద డిజాస్టర్ గా నిలిచిన ‘విడాముయార్చి’

vidaamuyarchi

కోలీవుడ్ స్టార్ నటుడు అజిత్ హీరోగా త్రిష హీరోయిన్ గా మగిళ్ తిరుమేణి దర్శకత్వంలో తెరకెక్కిన తాజా సినిమా విడాముయార్చి. తమిళ్ తో పాటు తెలుగులో పట్టుదల టైటిల్ తో రిలీజ్ అయిన ఈ సినిమా ఏమాత్రం ఆకట్టుకోలేదు. 

ఇక ఇటీవల థియేటర్స్ లోకి వచ్చిన ఈ సినిమాకి వచ్చిన టోటల్ కలెక్షన్ బట్టి చూస్తే ఇది గతంలో వచ్చిన అజిత్ వలిమై కంటే కూడా ఘోరమైన ఫెయిల్యూర్ అని తెలుస్తుంది. వలిమై సినిమాని హెచ్ వినోద్ తెరకెక్కించగా అది వరల్డ్ వైడ్ గా రూ. 155 కోట్ల గ్రాస్ రాబట్టింది. కాగా విడాముయార్చి కేవలం రూ. 145 కోట్ల దగ్గరే ఆగిపోయింది. 

నిజానికి ఇది రెగ్యులర్ కమర్షియల్ సినిమా కాదు యాక్షన్ తో సాగే స్టైలిష్ డ్రామా. ఇక హాలీవుడ్ మూవీ బ్రేక్ డౌన్ కి రీమేక్ క రూపొందిన ఈ సినిమా పై మొదటి నుంచి అజిత్ ఫ్యాన్స్ అంచనాలు పెంచుకున్నారు. ఓవరాల్ గా అయితే రిలీజ్ అనంతరం అందరికీ షాక్ ఇచ్చింది విడాముయార్చి. ప్రస్తుతం అజిత్ చేస్తున్న మూవీ గుడ్ బ్యాడ్ అగ్లీ. 

అధిక్ రవిచంద్రన్ తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో త్రిష హీరోయిన్ గా నటిస్తుండగా తెలుగు అగ్ర నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ దీనిని నిర్మిస్తోంది. ఈ మూవీతో తమ హీరో తప్పకుండా కం బ్యాక్ అందుకొని భారీ బ్లాక్ బస్టర్ కొడతారని అజిత్ ఫ్యాన్స్ అయితే ఆశపడుతున్నారు. ఏప్రిల్ 10న గుడ్ బ్యాడ్ అగ్లీ మూవీ గ్రాండ్ లెవెల్ లో ఆడియన్స్ ముందుకు రానుంది. 

Follow on Google News Follow on Whatsapp




Show comments
Exit mobile version