Home సినిమా వార్తలు Did Dragon Joins 100 Crore Club ‘డ్రాగన్’ రూ. 100 కోట్ల క్లబ్ లో...

Did Dragon Joins 100 Crore Club ‘డ్రాగన్’ రూ. 100 కోట్ల క్లబ్ లో చేరనుందా ?

dragon movie

ప్రస్తుతం కోలీవుడ్ నటుడు దర్శకుడు అయిన ప్రదీప్ రంగనాథన్ కీలక పాత్రలో యువ దర్శకుడు అశ్వత్ మారిముత్తు దర్శకత్వంలో తెరకెక్కిన లవ్ యాక్షన్ కామెడీ రొమాంటిక్ ఎంటర్టైనర్ మూవీ డ్రాగన్. తెలుగులో రిటర్న్ ఆఫ్ ద డ్రాగన్ టైటిల్ తో రిలీజ్ అయిన ఈ మూవీ అటు తమిళ్ తో పాటు తెలుగు ఆడియన్స్ ని కూడా విశేషంగా ఆకట్టుకుంటూ బాక్సాఫీస్ వద్ద మంచి కలెక్షన్ తో కొనసాగుతోంది. 

ఇప్పటికే గడిచిన రెండు రోజుల్లో భారీ స్థాయిలో కలెక్షన్ అందుకున్న ఈ సినిమా తమిళనాడులో రూ. 5.5 కోట్లతో ఓపెనింగ్స్ సొంతం చేసుకుని ఓవరాల్ గా రూ. 13 కోట్లకు ఇది చేరుకుంది. ఇక నిన్న ఆదివారం కావడంతో ఈ సినిమాకి మరింత భారీ కలెక్షన్ అయితే వచ్చింది. అన్ని వర్గాల ఆడియన్స్ ని ఈ మూవీ ఆకట్టుకుంటోంది. 

ఇక ప్రస్తుతం ఈ కలెక్షన్ ట్రెండ్ ని బట్టి చూస్తుంటే ఈ సినిమా త్వరలోనే ఓవరాల్ గా రూ. 100 కోట్ల క్లబ్ లో చెరే అవకాశం కనబడుతోంది. ప్రదీప్ రంగనాథన్ నశించిన గత సినిమా లవ్ టుడే ఓవరాల్ గా రూ. 90 కోట్ల వరకు గ్రాస్ అందుకుంది. ఒకవేళ ఈ మూవీ కనుక దాన్ని క్రాస్ చేసి రూ. 100 కోట్లు అందుకుంటే ప్రదీప్ కెరీర్ లోనే ఇది బిగ్గెస్ట్ హిట్ అని చెప్పాలి. 

ఈ మూవీలో నటుడిగా ప్రదీప్ పెర్ఫార్మన్స్ కి అందరి నుంచి విశేషమైన ప్రశంసలు వస్తున్నాయి. అలాగే దర్శకుడు అశ్వత్ మారిముత్తు టేకింగ్ కి కూడా అందరూ మంచి రెస్పాన్స్ అందిస్తున్నారు. మరోవైపు సాంగ్స్ తో పాటు లవ్ యాక్షన్ ఎమోషనల్ సన్నివేశాలు, కామెడీ వంటివి అందర్నీ ఎంతో ఆకట్టుకుంటున్నాయి. మరి ఓవరాల్ గా ఈ మూవీ ఎంత రాబడుతుందో చూడాలి. 

Follow on Google News Follow on Whatsapp




Show comments
Exit mobile version