కోలీవుడ్ యువ దర్శకుడు లోకేష్ కనకరాజ్ కు దేశవ్యాప్తంగా పలు భాషల ఆడియన్స్ లో మంచి క్రేజ్ ఉంది. ఇటీవల లియో మూవీ ద్వారా ఆడియన్స్ ముందుకి వచ్చిన లోకేష్ తాజాగా సూపర్ స్టార్ రజినీకాంత్ తో కూలీ అనే మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీతీస్తున్నారు .
నాగార్జున, ఉపేంద్ర, శృతి హాసన్, సత్యరాజ్ కీలక పాత్రలు చేస్తున్న ఈ మూవీ పై సాధారణ ప్రేక్షకుల్లో విపరీతమైన క్రేజ్ క్రేజ్ ఉంది. అయితే తాజాగా ఒక ఇంటర్వ్యూలో భాగంగా దర్శకుడు లోకేష్ మాట్లాడుతూ తన తదుపరి కమిట్మెంట్స్ అండ్ LCU ప్లానింగ్ గురించి చెప్పుకొచ్చారు.
కూలీ అనంతరం కార్తీతో ఖైదీ 2 ఉంటుందని, ఆల్మోస్ట్ స్క్రిప్ట్ మొత్తం పూర్తి అయిన ఈమూవీ త్వరలో పట్టాలెక్కుతుందని తెలిపారు. దాని తరువాత కమల్‌హాసన్ తో విక్రమ్2 ఉంటుందని, ఎందుకంటే ఆ కథ ఇంకా ముగియలేదన్నారు. ఇక చివరగా విజయ్ తో లియో 2 వస్తుందని తెలిపారు.
అయితే సూర్య రోలెక్స్ ఒక స్వతంత్ర చిత్రమని మరియు దాని కోసం నాకు ఒక ఆలోచన ఉందని, ఆ విషయమై నేను మరియు సూర్య సర్ చాలా కాలంగా చర్చలు జరుపుతున్నామని అన్నారు. ఇకపై తన నుండి వచ్చే మూవీస్ ఆడియన్స్ అంచనాలు అందుకునేలా ప్లాన్ చేస్తున్నానంటూ తెలిపారు లోకేష్ కనకరాజ్. ఇటీవల తీసిన లియో సెకండ్ హాఫ్ పై విమర్శలు వచ్చిన విషయం తెలిసిందే. అందుకే తన మూవీస్ విషయమై లోకేష్ మరింత శ్రద్ధ తీసుకుంటున్నట్లు తెలుస్తోంది.