నందమూరి కుటుంబం నుంచి మూడోతరం వారసుడుగా నందమూరి మోక్షజ్ఞ త్వరలో నటుడిగా ఎంట్రీ ఇవ్వనున్న విషయం తెలిసిందే. హనుమాన్ దర్శకుడు ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో ఆయన ఒక సినిమా చేయనున్నట్లు ఇటీవల ఫిక్స్ అయి ఫస్ట్ లుక్ పోస్టర్ కూడా రిలీజ్ అయింది. అందరిలో మంచి క్రేజ్ ఏర్పరిచిన ఈ సినిమా ఆల్మోస్ట్ ఆగిపోయినట్లే అని తెలుస్తోంది.
ఇక తాజా లేటెస్ట్ టాలీవుడ్ అప్డేట్ ప్రకారం గతంలో బాలకృష్ణతో గౌతమీపుత్ర శాతకర్ణి, ఎన్టీఆర్ కథానాయకుడు, మహానాయకుడు సినిమాలు తెరకెక్కించిన క్రిష్ జాగర్లమూడి మోక్షజ్ఞ ఫస్ట్ సినిమా తెరకెక్కించనున్నట్లు తెలుస్తోంది. ఆకట్టుకునే కథ, కథనాలతో ఈ సినిమా రూపొందుతుందని త్వరలో దీనికి సంబంధించిన అఫీషియల్ అనౌన్స్మెంట్ కూడా రానిందని సమాచారం.
మరోవైపు ప్రశాంత్ వర్మ తాజాగా జై హనుమాన్ తో పాటు ప్రభాస్ తో ఒక సినిమా అలానే మహాకాళి అనే మరొక సినిమా యొక్క షూటింగ్స్ ప్లానింగ్ లో ఉన్నారు. మరి పక్కాగా మోక్షజ్ఞ ఫస్ట్ మూవీని క్రిష్ తెరకెక్కిస్తారా లేదా ఆ సినిమా ఎప్పుడు మొదలవుతుంది అనే వివరాలు మొత్తం కూడా తెలియాలంటే మరి కొన్నాళ్ల వరకు వెయిట్ చేయాలి. మరోవై పు నందమూరి ఫ్యాన్స్ అయితే మోక్షజ్ఞ ఎంట్రీ కోసం ఎప్పటినుండో ఎంతో ఉత్సాహంగా ఎదురుచూస్తున్నారు