Home సినిమా వార్తలు Theatres urge Amaran to delay the OTT release ‘అమరన్’ ఓటిటి రిలీజ్ వాయిదా...

Theatres urge Amaran to delay the OTT release ‘అమరన్’ ఓటిటి రిలీజ్ వాయిదా వేయమంటున్న థియేటర్ ఓనర్స్

amaran

కోలీవుడ్ యువ నటుడు శివ కార్తికేయన్ హీరోగా సాయి పల్లవి హీరోయిన్ గా రాజ్ కుమార్ పెరియసామి దర్శకత్వంలో తెరకెక్కిన లేటెస్ట్ బయోగ్రఫికల్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ అమరన్. ఈ మూవీని రాజ్ కమల్ ఫిలిమ్స్ ఇంటర్నేషనల్, సోనీ పిక్చర్స్ ఫిలిమ్స్ ఇండియా వారు గ్రాండ్ లెవెల్లో నిర్మించగా జివి ప్రకాష్ కుమార్ సంగీతం అందించారు.

మొదటి నుండి అందరిలో మంచి అంచనాలు ఏర్పరిచిన ఈ మూవీ ఇటీవల ఆడియన్స్ ముందుకి వచ్చి బాక్సాఫీస్ వద్ద ప్రస్తుతం రూ. 250 కోట్లకు పైగా కలెక్షన్ తో కొనసాగుతోంది. తమిళ్ తో పాటు తెలుగులో కూడా అమరన్ కు ఆడియన్స్ నుండి మంచి రెస్పాన్స్ వస్తోంది. సైనిక అమరవీరుడు వరదరాజన్ ముకుందన్ జీవితం ఆధారంగా రూపొందిన ఈ మూవీలో శివ కార్తికేయన్, సాయి పల్లవి ల నటనతో పాటు దర్శకుడు రాజ్ కుమార్ పెరియసామి లపై ప్రేక్షకులు ప్రసంశలు కురిపిస్తున్నారు.

విషయం ఏమిటంటే, ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద భారీ కలెక్షన్ తో కొనసాగుతున్న ఈ మూవీ త్వరలో ఓటిటి ఆడియన్స్ ముందుకి రానుంది. వాస్తవానికి నాలుగు వారాల్లో ఓటిటి లోకి రావాల్సిన ఈ మూవీని మరొక రెండు వారాలు వాయిదా వేశారు. అయితే ప్రస్తుతం అమరన్ థియేటర్స్ లో అదరగొడుతుండడంతో ఓటిటి రిలీజ్ ని మరొక రెండు వారాలు అనగా మొత్తం ఎనిమిది వారాలు వాయిదా వేయాలని నిర్మాతలను థియేటర్స్ ఓనర్స్ ఒక లెటర్ రాయడం ద్వారా కోరారు. మరి దీని పై వారి నుండి ఎటువంటి రెస్పాన్స్ వస్తుందో చూడాలి.

Follow on Google News Follow on Whatsapp




Show comments
Exit mobile version