Home సినిమా వార్తలు Dulquer The New Favorite for Telugu Audiance తెలుగు ఆడియన్స్ కు మరింత దగ్గరవుతున్న...

Dulquer The New Favorite for Telugu Audiance తెలుగు ఆడియన్స్ కు మరింత దగ్గరవుతున్న దుల్కర్

Lucky Bhaskar

మలయాళ యువ నటుడు దుల్కర్ సల్మాన్ హీరోగా టాలీవుడ్ యువ దర్శకుడు వెంకీ అట్లురి దర్శకత్వంలో ప్రముఖ నిర్మాణ సంస్థలు సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్, శ్రీకర స్టూడియోస్ కలిసి సంయుక్తంగా నిర్మించిన తాజా సినిమా లక్కీ భాస్కర్. యువ అందాల నటి మీనాక్షి చౌదరి హీరోయిన్ గా నటించిన ఈ సినిమా ఇటీవల రిలీజ్ అయి బాక్సాఫీస్ వద్ద సెన్సేషన్ అయితే క్రియేట్ చేస్తోంది.

ఫస్ట్ డే ఫస్ట్ షో నుంచి సూపర్ హిట్ టాక్ ని సొంతం చేసుకున్న ఈ సినిమా ముఖ్యంగా తెలుగులో కూడా బాగానే కలెక్షన్ రాబడుతున్నప్పటికీ అటు తమిళనాడు, కేరళలో మరింతగా అదరగొట్టేలా కొనసాగుతోంది. ఇక ఇప్పటివరకు ఈ సినిమా కేరళలో రూ. 60 కోట్లని రూ. 12 రోజుల్లో రాబట్టగా తమిళనాడులో రూ.10 కోట్లను రాబట్టింది. ఒకరకంగా ఇది బయ్యర్స్ కి మంచి ప్రాఫిటబుల్ వెంచర్ అని చెప్పాలి.

ఇప్పటివరకు ఈ సినిమా వరల్డ్ వైడ్ గా 12 రోజుల్లో రూ. 90 కోట్లు రాబట్టగా అతి త్వరలోనే రూ. 100 కోట్ల మార్కునైతే చేరుకోబోతోంది. ఇటీవల తెలుగులో సీతారామం సినిమా ద్వారా ఆడియన్స్ ముందుకు వచ్చి ఇక్కడి ఆడియన్స్ నుండి బాగా క్రేజ్ సంపాదించుకున్న దుల్కర్ కి లక్కీ భాస్కర్ విజయం ఇక్కడి ఆడియన్స్ కి మరింత చేరువ చేసిందని చెప్పాలి. కాగా రాబోయే రోజుల్లో ఆయన తెలుగులో ఎంతమేర సినిమాలు చేస్తారో చూడాలి.

Follow on Google News Follow on Whatsapp




Show comments
Exit mobile version