Home బాక్సాఫీస్ వార్తలు Did SJ Surya Role in Game Changer was Impressive ‘గేమ్ ఛేంజర్’ లో...

Did SJ Surya Role in Game Changer was Impressive ‘గేమ్ ఛేంజర్’ లో ఎస్ జె సూర్య రోల్ ఆకట్టుకుంటుందా ?

sj suryah

మొదట తెలుగు సినిమా పరిశ్రమకు దర్శకుడిగా పరిచయమయ్యారు నటుడు ఎస్ జె సూర్య. మొదట పవన్ కళ్యాణ్ హీరోగా 2001లో తెరకెక్కిన ఖుషి సినిమాతో దర్శకుడిగా పెద్ద బ్లాక్ బస్టర్ అందుకున్నారు ఎస్ జె సూర్య. ఆ తరువాత మహేష్ బాబుతో నాని మూవీ తీశారు. అదే అది ఆశించిన స్థాయిలో ఆడలేదు. అనంతరం మరొకసారి పవన్ తోనే ఎస్ జె సూర్య తీసిన పులి చిత్రం కూడా పరాజయం పాలయింది. ఆ తర్వాత నటుడుగా మారిన ఎస్ జె సూర్య ఒక్కొక్క పాత్రతో తనదైన ఆకట్టుకునే పర్ఫామెన్స్ తో ఆడియన్స్ మనసులో మంచి స్థానాన్ని సంపాదించారు.

2017లో సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా మురుగదాస్ దర్శకత్వంలో తెరకెక్కినటు స్పైడర్ సినిమాలో భైరవుడు పాత్రల్లో కనిపించిన సూర్య ఆ పాత్రలో సూపర్ పెర్ఫార్మన్స్ తో అందరి మనసులు గెలుచుకున్నారు. ఇక ఇటీవల సరిపోదా శనివారం, రాయన్ వంటి సినిమాల్లో కూడా ఆయన పెర్ఫామెన్స్ కి విశేషమైన క్రేజ్ లభించింది. అయితే విషయం ఏమిటంటే ఇటీవల శంకర్ దర్శకత్వంలో కమలహాసన్ హీరోగా రూపొందిన ఇండియన్ 2 మూవీలో మాత్రం సూర్య పాత్రకి పెద్దగా ఆశించి వస్తాయి రెస్పాన్స్ రాలేదు, ఆ క్యారెక్టర్ కూడా అంతగా ఎలివేట్ కాలేదు.

ఇక ప్రస్తుతం రామ్ చరణ్ హీరోగా శంకర్ తీస్తున్న భారీ పాన్ ఇండియన్ మూవీ గేమ్ చేంజర్ లో ఒక ముఖ్య పాత్ర చేస్తున్నారు సూర్య. తాజాగా రిలీజ్ అయిన ఆ మూవీ టీజర్ లో సూర్య పాత్రను బట్టి చూస్తే మరొకసారి ఆయనకి అద్భుతమైన పెర్ఫార్మన్స్ కనబరిచే రోల్ దక్కినట్టు తెలుస్తోంది. జనవరి 10న సంక్రాంతి కానుక గ్రాండ్ లెవెల్లో రిలీజ్ కానున్న ఈ సినిమాలోని తన పాత్రతో మరొకసారి సూర్య నటుడుగా ఎంత మంచిపేరు సంపాదించుకుంటారో చూడాలి.

Follow on Google News Follow on Whatsapp




Show comments
Exit mobile version