Home సినిమా వార్తలు లోకేష్ కనకరాజ్ తదుపరి సినిమా పై కొనసాగుతున్న సస్పెన్స్

లోకేష్ కనకరాజ్ తదుపరి సినిమా పై కొనసాగుతున్న సస్పెన్స్

lokesh kanagaraj

యువ సెన్సేషనల్ డైరెక్టర్ లోకేష్ కనకరాజ్ తాజాగా రజినీకాంత్ తో చేసిన మూవీ కూలీ. ఈ మూవీలో కింగ్ అక్కినేని నాగార్జున విలన్ గా నటించగా ఇతర కీలక పాత్రల్లో సౌబిన్ షాహిర్, రచిత రామ్, ఉపేంద్ర, అమీర్ ఖాన్ తదితరులు కీలక పాత్రలు చేసారు.

లోకేష్ మార్క్ టేకింగ్ తో రజిని మార్క్ స్టైల్, మాస్ యాక్షన్ తో రూపొందిన ఈ మూవీ బాగానే టాక్ అందుకుని ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద పర్వాలేదనిపించే కలెక్షన్ తో కొనసాగుతోంది. అనిరుద్ సంగీతం అందించిన ఈ మూవీని సన్ పిక్చర్స్ సంస్థ గ్రాండ్ గా నిర్మించింది.

అయితే దీని అనంతరం లోకేష్ ఎవరితో మూవీ చేస్తారు అనేది అందరిలో ఎంతో ఆసక్తికరంగా మారింది. అయితే ఆయన సూపర్ స్టార్ రజినీకాంత్, లోకనాయకుడు కమల్ హాసన్ లతో భారీ మల్టి స్టారర్ మూవీ తీస్తారనేది లేటెస్ట్ కోలీవుడ్ బజ్.

ఇద్దరు వయసైన గ్యాంగ్ స్టర్స్ కథగా ఈ మూవీ సాగుతుందని టాక్. మరోవైపు ఖైదీ 2 నే లోకేష్ తదుపరి మూవీ అని కూడా కొందరు అంటున్నారు. అయితే పక్కాగా కూలీ అనంతరం లోకేష్ కనకరాజ్ ఎవరితో మూవీ చేస్తారు అనేది మాత్రం మరొక్కసారి ఆయన నుండి క్లారిటీ రావాల్సి ఉంది. 

Follow on Google News Follow on Whatsapp




Exit mobile version