Home సినిమా వార్తలు ‘సత్యం సుందరం’ డైరెక్టర్ కి స్పెసిల్ గిఫ్ట్ ఇచ్చిన సూర్య, కార్తీ 

‘సత్యం సుందరం’ డైరెక్టర్ కి స్పెసిల్ గిఫ్ట్ ఇచ్చిన సూర్య, కార్తీ 

satyam sundaram

ఇటీవల కోలీవుడ్ లో రూపొంది అందరినీ అలరించిన హృద్యమైన ఎమోషనల్ ఎంటర్టైనర్ మూవీ సత్యం సుందరం. ఈ మూవీలో కార్తీ, అరవింద్ స్వామి, శ్రీ దివ్య కీలక పాత్రల్లో నటించారు. తమిళ్ తో పాటు తెలుగులో కూడా సత్యం సుందరం మూవీ బాగా సక్సెస్ అయింది.

ఈ మూవీని ప్రేమ్ కుమార్ తెరకెక్కించగా 2డి ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై సూర్య, జ్యోతిక దీనిని గ్రాండ్ గా నిర్మించారు. గోవింద్ వసంత మ్యూజిక్ అందించిన ఈ మూవీకి మహేంద్రన్ జయరాజు ఫోటోగ్రఫి అందించారు.

అయితే ఈ మూవీ విజయవంతం అవడంతో అప్పట్లో టీమ్ ఎంతో ఆనందం వ్యక్తం చేసింది. ఇటువంటి అరుదైన కథా బలంతో కూడిన సినిమాలు అరుదుగా వస్తాయని, ఇది తన కెరీర్ లో ఎంతో ప్రత్యేకం అని కార్తీ తెలిపారు.

విషయం ఏమిటంటే, ఆ మూవీ యొక్క భారీ విజయానికి గుర్తుగా తాజాగా సూర్య, కార్తీ కలిసి దర్శకుడు ప్రేమ్ కుమార్ కు ఒక విలువైన కారుని బహుమతిగా అందించి తమ గొప్ప మనసు చాటుకున్నారు. కాగా తమ సంస్థకి ఇంతమంచి చిత్రం అందించడంతో సూర్య, కార్తీ ఇద్దరూ ఈ కారు ని బహుమతిగా ఇవ్వడం ఎప్పటికీ మరిచిపోలేనని అన్నారు ప్రేమ్ కుమార్.

Follow on Google News Follow on Whatsapp




Show comments
Exit mobile version