Home సినిమా వార్తలు ‘ది రాజాసాబ్’ టీజర్ : అంతా ఆయన చేతుల్లోనే ?

‘ది రాజాసాబ్’ టీజర్ : అంతా ఆయన చేతుల్లోనే ?

the rajasaab

పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్ హీరోగా తాజాగా తెరకెక్కుతున్న సినిమాల్లో ది రాజాసాబ్ మూవీ కూడా ఒకటి. హర్రర్ కామెడీ యాక్షన్ ఎంటర్టైనర్ గా రూపొందుతున్న ఈ మూవీలో మాళవిక మోహనన్, రిద్ధి కుమార్, నిధి అగర్వాల్ హీరోయిన్స్ గా నటిస్తుండగా కీలక పాత్రల్లో సంజయ్ దత్, మురళి శర్మ, అనుపమ్ ఖేర్, వెన్నెల కిషోర్, యోగి బాబు, జరీనా వాహబ్ నటిస్తున్నారు.

ఇప్పటికే చాలావరకు షూటింగ్ జరుపుకున్న ఈ మూవీ యొక్క టీఆర్ ని త్వరలో రిలీజ్ చేసేందుకు టీమ్ సన్నాహాలు చేస్తోంది. వాస్తవానికి టీజర్ కట్ మొత్తం కూడా రెడీ అయిందని, అయితే ప్రభాస్ అతి త్వరలో విదేశాల నుండి తిరిగి వచ్చిన అనంతరం దీనికి డబ్బింగ్ చెప్తారని తెలుస్తోంది. అనంతరం టీజర్ ని రిలీజ్ చేయనున్నారట.

కాగా అతిత్వరలో ది రాజాసాబ్ టీజర్ గురించిన అప్ డేట్ ఎప్పుడైనా రావచ్చనేది లేటెస్ట్ టాలీవుడ్ బజ్. అలానే దానిలో మూవీ రిలీజ్ డేట్ ని కూడా అనౌన్స్ చేయనున్నారట. మొత్తంగా అందరిలో మంచి అంచనాలు ఏర్పరిచిన ది రాజాసాబ్ మూవీ రిలీజ్ అనంతరం ఎంత మేర విజయం అందుకుంటుందో చూడాలి. తొలిసారి స్టార్ యాక్టర్ ప్రభాస్ తో తీస్తున్న మూవీ కావడంతో దర్శకుడు మారుతీ దీనిని ఎంతో జాగ్రత్తగా తెరకెక్కిస్తున్నట్లు చెప్తోంది టీమ్.

Follow on Google News Follow on Whatsapp




Show comments
Exit mobile version