Home సినిమా వార్తలు Superstar Mahesh Fans Upset SSMB 29 : సూపర్ స్టార్ మహేష్ ఫ్యాన్స్ నిరాశ

Superstar Mahesh Fans Upset SSMB 29 : సూపర్ స్టార్ మహేష్ ఫ్యాన్స్ నిరాశ

ssmb 29

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా ఇటీవల త్రివిక్రమ్ తీసిన గుంటూరు కారం మూవీ మంచి విజయం అందుకుంది. ఈ ఏడాది సంక్రాంతికి గుంటూరు కారం ఆడియన్స్ ముందుకి వచ్చిన విషయం తెలిసిందే. దీని అనంతరం రాజమౌళి తో చేయనున్న ప్రతిష్టాత్మక పాన్ వరల్డ్ గ్లోబ్ ట్రాటింగ్ యాక్షన్ అడ్వెంచర్ SSMB 29 మూవీ కోసం ఇప్పటికే బాడీ బల్క్ గా పెంచుతుండడంతో పాటు ఫుల్ గా క్రాఫ్, గడ్డం పెంచుతూ న్యూ లుక్ లో సిద్ధమవుతున్నారు మహేష్.

ఈ మూవీ పై సూపర్ స్టార్ ఫ్యాన్స్ తో పాటు ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఆడియన్స్ అందరిలో భారీ అంచనాలు ఉన్నాయి. శ్రీ దుర్గ ఆర్ట్స్ బ్యానర్ పై కేఎల్ నారాయణ దీనిని గ్రాండ్ లెవెల్లో భారీ వ్యయంతో నిర్మించనున్నారు. ఇప్పటికే స్టోరీ లాక్ అయిన ఈ మూవీ యొక్క ప్రీ ప్రొడక్షన్ వర్క్ ప్రస్తుతం హైదరాబాద్ లో వేగంగా జరుగుతోంది.

విషయం ఏమిటంటే, నేడు సూపర్ స్టార్ మహేష్ బాబు 49వ జన్మదినం సందర్భంగా SSMB 29 మూవీ నుండి అనౌన్స్ మెంట్ అప్ డేట్ వస్తుందని అందరూ భావించారు, ముఖ్యంగా మహేష్ ఫ్యాన్స్ అయితే ఎప్పటినుండో దీని కోసం ఎంతో ఆసక్తికరంగా ఎదురు చూస్తున్నారు. కానీ నేడు దీనికి సంబంధించి ఎటువంటి అప్ డేట్ లేకపోవడంతో ఫ్యాన్స్ చాలా వరకు నిరాశకు లోనవుతూ సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు. అయితే ఆ మూవీకి సంబంధించి పూర్తి వివరాలు, అనౌన్స్ మెంట్ వంటివి రావడానికి మరికొంత సమయం పడుతుందని విశ్వసనీయ వర్గాల టాక్.

Follow on Google News Follow on Whatsapp




Show comments
Exit mobile version